Australian Open-2023: Djokovic Wins 10th Australian Open and 22nd
Overall Grand Slam
ఆస్ట్రేలియన్
ఓపెన్-2023: పదవ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన జకోవిచ్ – మొత్తంగా 22 వ గ్రాండ్
స్లామ్
========================
సెర్బియా
టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన కెరీర్ లో 22వ గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టైటిల్ ఫైనల్లో సిట్సిపాస్ పై అద్భుత విజయం సాధించాడు. దీంతో పదో సారి
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను
దక్కించుకొన్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 6-3, 7-6, 7-6 తేడాతో సిట్సిపాస్ పై జకోవిచ్ గెలుపొందాడు. నాలుగో సీడ్
గా బరిలోకి దిగిన జకోవిచ్ టోర్నీ ఆద్యంతం
తన ఫామ్ ను కొనసాగించాడు. అయితే ఫైనల్లో తొలి సెట్ ను సులువుగానే సొంతం చేసుకొన్న జకో.. రెండు, మూడు సెట్లలో మాత్రం సిట్సిపాస్ నుంచి ప్రతిఘటన తప్పలేదు.
చివరి రెండు సెట్లూ టై బ్రేక్ గేమ్లకు వెళ్లడం విశేషం. అయితే అక్కడా జకోవిచ్
ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ ను దక్కించుకొన్నాడు.
కరోనా
వ్యాక్సిన్ వ్యవహారం నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లి మరీ గతేడాది ఆస్ట్రేలియన్
ఓపెన్ లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో తన ఛాంపియన్ ఆటతీరును జకోవిచ్
ప్రదర్శించాడు. టాప్ ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆరంభంలోనే ఇంటిముఖం పట్టడం కూడా
జకోవిచ్ కు కలిసొచ్చింది. అయితే ఫైనల్లో సిట్సిపాస్ నుంచి గట్టి పోటీనే తట్టుకొని
మరీ టైటిల్ ను సొంతం చేసుకొన్నాడు. దీంతో కెరీర్లో 22వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకొని నాదల్ (22) తో సమంగా నిలిచాడు.
========================
0 Komentar