Australian Open-2023: Sabalenka Wins
Women’s Singles Title – She is First ‘Neutral’ Grand Slam Champion
ఆస్ట్రేలియన్
ఓపెన్-2023:
మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలెంక – టెన్నిస్ చరిత్రలో
తటస్థ క్రీడాకారిణిగా ఆడి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్ గా రికార్డు
========================
ఆస్ట్రేలియన్
ఓపెన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ అరీనా సబలెంక. గ్రాండ్ స్లామ్ సింగిల్స్
తొలిసారి ఫైనల్ చేరిన ఈ 24 ఏళ్ల అమ్మాయి.. తొలి
సెట్ కోల్పోయినా తిరిగి పుంజుకుని టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. శనివారం తుదిపోరులో
ఈ అయిదో సీడ్ క్రీడాకారిణి 4-6, 6-3, 6-4 తేడాతో
వింబుల్డన్ ఛాంపియన్ రిబకినా (కజకిస్థాన్)పై విజయం సాధించింది. శక్తిమంతమైన
సర్వీస్లతో చెలరేగిన సబలెంక.. రాకెట్పై పూర్తి నియంత్రణతో, కచ్చితమైన ప్రదేశంలోకి బంతిని పంపిస్తూ పాయింట్లు
రాబట్టింది. కానీ తొలి సెట్లో ఆధిపత్యం మాత్రం 22వ సీడ్ రిబకినాదే. మూడో గేమ్ లో ప్రత్యర్థి అనవసర తప్పిదంతో బ్రేక్ పాయింట్
సాధించిన రిబకినా, ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్ లో బ్యాక్ హ్యాండ్
విన్నర్ తో తొలి బ్రేక్ పాయింట్ సాధించిన
సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. కానీ తర్వాతి గేమ్ డబుల్ ఫాల్ట్ల
సర్వీస్ కోల్పోవడం ఆమెను దెబ్బతీసింది. పదో గేమ్ సర్వీస్ నిలబెట్టుకున్న రిబకినా
తొలి సెట్ నెగ్గింది. రెండో గేమ్ లో సబలెంక దూకుడు ప్రదర్శించింది. ఏస్లు, విన్నర్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా చూడముచ్చటైన
బ్యాక్హ్యాండ్ షాట్లతో అలరించింది. చూస్తుండగానే 4-1తో దూసుకెళ్లింది. అదే ఊపులో వరుసగా రెండు ఏస్లతో రెండో సెట్ ను నెగ్గింది.
నిర్ణయాత్మక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. స్కోరు 3-3తో సమమైన దశలో బ్రేక్ పాయింట్ సాధించడం సబలెంకకు కలిసొచ్చింది. తర్వాతి గేమ్న
సొంతం చేసుకున్న ఆమె 5-3తో పైచేయి
సాధించింది. ఆ వెంటనే రిబకినా ఓ గేమ్ నెగ్గినా.. పదో గేమ్ పట్టువదలకుండా పోరాడిన
సబలెంక సెట్తో పాటు మ్యాచ్్నూ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్
టైటిళ్లను అలెగ్జాండర్ బ్లాక్ (బెల్జియం), అలీనా
కోర్నీవా (రష్యా) దక్కించుకున్నారు.
జాతీయ
పతాకంతో సంబరాలు లేకుండా తొలి సారిగా ..
సింగిల్స్
లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన
సబలెంక జాతీయ పతాకంతో సంబరాలు చేసుకోలేకపోయింది. అందుకు ప్రత్యేక కారణం ఉంది.
ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా రష్యా, బెలారస్
ప్లేయర్లను ఈ గ్రాండ్ స్లామ్ లో వాళ్ల
దేశాల తరపున ప్రాతినిథ్యం వహించకుండా నిషేధించారు. ఆయా దేశాల జాతీయ పతాకాలను
ప్రదర్శించడానికి నిరాకరించారు. కానీ వీళ్లు తటస్థ ప్లేయర్లుగా పోటీపడొచ్చు.
ఇప్పుడు బెలారస్ కు చెందిన సబలెంక.. ఇలాగే
బరిలో దిగి విజేతగా నిలిచింది. దీంతో టెన్నిస్ చరిత్రలో తటస్థ క్రీడాకారిణిగా ఆడి
గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్ గా ఆమె రికార్డు సృష్టించింది.
మరోవైపు రష్యాలో పుట్టిన రిబకినా.. కజకిస్థాను ప్రాతినిథ్యం వహిస్తోంది. టెన్నిస్
కెరీర్ కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆ దేశం ముందుకు రావడంతో ఆమె 2018 నుంచి కజకిస్థాన్ కు ఆడుతోంది.
========================
0 Komentar