Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chat GPT – A New AI – What is Chat GPT and How it Works?

 

Chat GPT – A New AI – What is Chat GPT and How it Works?

చాట్ జీపీటీ...కొత్త కృత్రిమ మేధ  - చాట్ జీపీటీ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుంది?

=========================

చాట్ జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారైన చాట్బాట్ గూగుల్ కు  సవాల్ విసురుతోంది. ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాటి జీపీటీని చూసి గూగుల్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్ ను దాటి పోతుందని అనుకుంటున్నారు.

శాన్ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్వేరే ఈ చాట్ జీపీటీ. 2015లో శామ్ ఆల్ట్మైన్, ఎలాన్ మస్క్ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్ కూడా ఇందులో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.

ప్రత్యేకత?

ఇంటర్నెట్ లోని కోట్ల పదాల శిక్షణతో రూపొందిన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ జీపీటీ -3ని (జెనెరేటివ్ ప్రి ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్-3) ఓపెన్ఏఐ ప్రకటించింది. ప్రస్తుతానికి 175 బిలియన్ రకాల పారామితులతో కూడిన అత్యంత భారీ, శక్తిమంతమైన ఏఐ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్ పదాలను దీని వ్యవస్థలో అమర్చారు.

మనుషుల మాదిరిగా రాతరూపంలో ఆవిష్కరించటమేగాకుండా, అనువాదాల్లో కూడా ఇది ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్ సెర్చి మాదిరిగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్ చేయటంతో ఆగకుండా... సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. చాట్పీటీ. అంతేగాకుండా ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. అంతెందుకు టాపిక్ చెబితే కొత్త కవిత, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషులు మాట్లాడే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇవ్వగలుగుతుంది. మనుషులు మాట్లాడుకున్నట్లే పిచ్చాపాటీ కబుర్లు చెబుతుంది. జోక్ లు పేలుస్తుంది. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాటో బోట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి పరిధి చాలా పరిమితం. ఈ చాటీ జీపీటీ మాత్రం వేగంగా, ఎదురుగా మనిషి కూర్చొని సమాధానం ఇచ్చినట్లే ఏది అడిగినా చెబుతుంది.

గూగుల్లో ఏదైనా అడిగితే దానికి సంబంధించిన లింక్ ల జాబితా వరుసగా వస్తుంది. కానీ అదే చాట్ జీపీటీని అడిగితే... లింక్లు ఇచ్చి విడిచిపెట్టకుండా... ఆ అంశాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరంగా అర్థం చేయిస్తుంది. అందుకే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్ ఇంజిన్ పై  ఆధారపడటం తగ్గుతుందన్నది ఆందోళన. "గూగుల్ పని అయిపోయినట్లే! బహుశా మరో ఏడాదో రెండేళ్లలోనో కృత్రిమ మేధ గూగుల్ ను  విచలితం చేయబోతోంది. ఎల్లో పేజెస్ ను గూగుల్ ఎలా దెబ్బతీసిందో... చాటీజీపీటీ గూగుల్ కు  అదే పని చేయబోతోంది"అని జీమెయిల్ డెవలపర్ పౌల్ బుచెట్ హెచ్చరించటం గమనార్హం. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గూగుల్.. చాటీపీటీకి దీటైన సాఫ్ట్వేర్ను రూపొందించే పనిలో పడింది.

=========================

WEBSITE

DOWNLOAD CHAT GPT APP

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags