FROOTS - Children’s
Telugu Monthly e-Magazine
"ఫ్రూట్స్" - చిన్నారుల ఈ-మాసపత్రిక
===================
DOWNLOAD E-MAGAZINE
MONTHLY WISE
===================
2024
===================
2023
===================
ఫ్రూట్స్ e-మాసపత్రికలోని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి విషయాన్ని మీరు యూట్యూబ్ లో వీక్షించే సౌకర్యం ఉంది. మీరు కేవలం
ఇవ్వబడిన చిత్రాలపై నొక్కి వీక్షించవచ్చు.
===================
మిత్రులారా!
ఈ నెల నుండి
"Froots interactive children e-magazine" (monthly) ను
ప్రారంభించడం జరిగింది.
గౌరవనీయులైన T.V.S Ramesh గారు,
మరియు C.A.
Prasad గార్ల విలువైన మార్గదర్శకత్వంలో Froots teachers team
తయారు చేసిన e-మాస పత్రికలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికి తీసే ఒక
చక్కని సాధనంగా ఈ పత్రికను చెప్పుకోవచ్చు.
ఈ magazine కున్న ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు వాళ్ళు చేసిన పనులను
వాళ్ళే స్వయంగా వివరిస్తూ చెప్పిన video లను Clickable format లో
అందించడం జరిగింది. సూచించిన ఫోటో పై నొక్కడం ద్వారా విద్యార్థులు సులువుగా video లను చూడవచ్చు.
ఎంతోకాలం
నుండి froots teachers team గా కొనసాగుతూ, వారి వారి తరగతుల్లో అద్భుతాలను ఆవిష్క రిస్తున్న టీచర్స్ గురించి కూడా
మనం ఈ పత్రికలో చూడవచ్చు. పిల్లలకు నచ్చే, పిల్లలు మెచ్చే
కథలు ,పాటలు, ఆటలు, పజిల్స్, ఒరిగామి , కిరిగామి
వంటివన్నీ ఒకే చోట అందించడం జరిగింది.
గౌరవనీయులైన
ఉపాధ్యాయులందరికీ మా మనవి ఏమిటంటే, ఈ
పత్రికను whatsapp group ల ద్వారా ప్రతీ పాఠశాలలో ని
విద్యార్థి చెంతకు చేరవేయ్యడం లో మీ వంతు, సహాయం అందిస్తారని
ఆశిస్తున్నాము.
===================
చిన్నారులారా!
మన ఫ్రూట్స్ e-మాసపత్రిక మన రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో (1 నుండి 5వ తరగతి
విద్యార్థులలో) దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయుటకు విద్యార్థుల రచనలను, కృత్యాలను ఆహ్వానిస్తుంది.
ఫ్రూట్స్
పిల్లల పత్రిక కొరకు చిత్రాలు ఆర్ట్ & క్రాఫ్ట్ (పేపర్ మరియు బంక మట్టితో), కొలోజ్, ఒరిగామి వంటివి. ఏకపాత్రాభినయం (రోల్ ప్లే), నాటికలు, అభినయ గేయాలు, కథ చెప్పటం, సైన్స్
ప్రయోగం,
ఫజిల్స్, పిల్లల అనుభవాలను
పంపవచ్చును.
మీరు చేసిన
కృత్యం గురించి టైపు చేసి, మీ ఫొటో, మీ వివరాలతో పాటు ఒక నిమిషం నిడివి గల వీడియోను జతచేసి
పంపగలరు.
మీ రచనలను 7013871429 వాట్సాప్ నంబర్ కు లేదా frootsnextgenschooling@gmail.com కు పంపవచ్చును. మీ రచనలు మాకు ప్రతి నెల 5వ తేదీలోపు పంపవలెను. మీ రచనలపై సంపాదకులదే తుది నిర్ణయం.
ఉపాధ్యాయ
మిత్రులు మీ పాఠశాల అనుభవాలను, మీరు తయారుచేసిన
సృజనాత్మక బోధనా పరికరం (TLM), ప్రయోగం మరియు బోధన
మెళకువలు,
పాఠశాల బోధనలో మీకు ఎదురయ్యే సమస్యలను గురించి, మీ పాఠశాల పరిచయమును రాసి మాకు పంపగలరు. దీనితోపాటు రెండు
నిమిషాల నిడివి గల వీడియోను కూడా తీసి పంపగలరు.
===================
0 Komentar