Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ganga Vilas: Longest River Luxury Cruise to Cover 50 Tourist Spots In 51 Days – Details Here

 

Ganga Vilas: Longest River Luxury Cruise to Cover 50 Tourist Spots In 51 Days – Details Here

గంగా విలాస్‌: నదీ పర్యటక నౌక రేపే (జనవరి 13) ప్రారంభం -  50 పర్యటక స్థలాలు - 51 రోజులు – వివరాలు ఇవే

దేశం లోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక 'ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) శుక్రవారం (జనవరి 13) వారణాసిలో ప్రారంభించనున్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యటక నౌకగా పేరొందింది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి.

50 పర్యటక స్థలాలు - 51 రోజులు

భారత్ లోని  ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు బంగ్లాదేశ్లోని నదుల్లో ఈ నౌక (Ganga Vilas) ప్రయాణిస్తుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరధి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్ లోని  మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. గంగా విలాస్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మొదలయ్యే అస్సాంలోని దిబ్రుగఢ్ లో ముగుస్తుంది. మొత్తం 51 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యటక ప్రాంతాల్లో ఆగుతుంది. వారణాసిలోని గంగా హారతి, విక్రమశిల యూనివర్శిటీ, సుందర్బన్ డెల్టా, కజీరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడొచ్చు.

సదుపాయాలు..

62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడెల్పు ఉండే ఈ భారీ క్రూజ్ (Ganga Vilas)లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు. మూడు సన్ డెక్ లు , జిమ్ సెంటరు, స్పా సదుపాయం ఉంది. నదీ వ్యూ కన్పించేలా ఉంటే పారదర్శక లాంజ్ లో  ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. ప్రయాణికులను ఆహ్లాదపర్చేలా నౌకలో కళా సాంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేయనున్నారు.

టికెట్ ధర ఇలా..

జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ నౌక తొలి ప్రయాణం మొదలవుతుంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు మార్చి 1న దిబ్రూగఢ్ చేరుకుంటారని తెలిపారు. మరి ఇంత ప్రత్యేకమైన ఈ గంగా విలాస్ (Ganga Vilas) టికెట్ ధర ఎంతో తెలుసా..? ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ. 25 వేలు. అంటే ఈ యాత్ర మొత్తానికి రూ.12.75లక్షల ఖర్చవుతుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags