Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC Recruitment 2023: Apply for 9394 ADO Posts – Details Here

 

LIC Recruitment 2023: Apply for 9394 ADO Posts – Details Here

ఎల్ఐసీ రిక్రూట్మెంట్ 2023: మొత్తం 9394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే

======================

UPDATE 30-05-2023

మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదల

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏడీవో) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 23న నిర్వహించిన ప్రధాన పరీక్ష ఫలితాలు మే 30న విడుదలయ్యాయి. జోన్ల వారీగా ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మార్చి 12న ప్రాథమిక పరీక్ష నిర్వహించింది.

ఎల్ఐసీ దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 9,394 ఏడీవో పోస్టుల భర్తీకి జనవరిలో జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెయిన్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్)- 561, ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్కతా)- 1049, ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా)- 669, నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ)- 1216, నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్)- 1033, సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై)- 1516, సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్)- 1408, వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి)- 1942.. మొత్తం 9394 ఏడీవో పోస్టులను ఎల్ఐసీ భర్తీ చేయనుంది.

CLICK FOR MAINS RESULTS

======================

UPDATE 17-04-2023

మెయిన్ పరీక్ష తేదీ: 23/04/2023  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

======================

UPDATE 10-04-2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

ఎల్ఐసీ కార్యాలయాల్లో అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీవో) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జోన్ల వారీగా మొత్తం 9,394 ఏడీవో పోస్టులను భర్తీ చేసేందుకు జనవరిలో భారీ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. వీటిలో సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) పరిధిలోనే 1,408 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్ 10న జోన్ల వారీగా ఫలితాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు.

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా ఏప్రిల్ 23న జరిగే మెయిన్స్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మెయిన్లోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.

CLICK FOR RESULTS

WEBSITE

======================

UPDATE 04-03-2023

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023

ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ల విడుదల తేదీలు: 03-03-2023 నుండి 12-03-2023   

DOWNLOAD CALL LETTER

WEBSITE

======================

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ  కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించి.. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్: 9394 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీల వివరాలు...

సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్): 561

ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్ కతా): 1049

ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా): 669

నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ): 1216

నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్): 1033

సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై): 1516

సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408

వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1942

మొత్తం ఖాళీలు: 9394

దక్షిణ మధ్య జోన్లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఖాళీలు: 1408.

డివిజన్ల వారీగా ఖాళీలు:

కడప- 90,

హైదరాబాద్- 91,

కరీంనగర్- 42,

మచిలీపట్నం- 112,

నెల్లూరు - 95,

రాజమహేంద్రవరం - 69,

సికింద్రాబాద్- 94,

విశాఖపట్నం- 57,

వరంగల్- 62,

బెంగళూరు-1- 115,

బెంగళూరు-2- 117,

బెల్గాం- 66,

ధార్వాడ్- 72,

మైసూర్- 108,

రాయచూర్ - 83,

షిమోగా- 51,

ఉడిపి- 84.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: ఏడీఓగా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్ గా  చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా నెలకు రూ. 35,650 - రూ. 90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ప్రిలిమ్స్ లో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. మెయిన్స్లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్ నెస్ తదితర సబ్జెక్టుల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750.(ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.100).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21-01-2023.

ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10-02-2023.

ఆన్లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్ ప్రారంభం: 04-03-2023. 03-03-2023

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023.

మెయిన్ పరీక్ష తేదీ: 08-04-2023. 23-04-2023

======================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

PRESS NOTE ON MAIN EXAM

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags