Padma Awards 2023: Full List of Padma
Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients
పద్మ
అవార్డులు-2023: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ
గ్రహీతల పూర్తి జాబితా ఇదే
=======================
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి; కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణిని పద్మశ్రీ వరించింది.
తెలుగు
రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు వీరే..
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి. రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (కళలు), గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు; (సైన్స్ అండ్ ఇంజినీరింగ్); సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్); సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ); ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో)లను పద్మశ్రీ వరించింది.
పద్మవిభూషణ్
బాలకృష్ణ
జోషీ (మరణానంతరం)- ఆర్కిటెక్ రంగం- గుజరాత్
ప్రముఖ తబలా
విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (కళలు)- మహారాష్ట్ర
కేంద్ర మాజీ
మంత్రి ఎస్.ఎం. కృష్ణ (పబ్లిక్ అఫైర్స్)
దిలీప్
మహాలనబిస్ (మరణానంతరం) - వైద్యరంగం - బెంగాల్
శ్రీనివాస్
వర్ధన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)- ఎన్నారై
ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం) - పబ్లిక్ అఫైర్స్ విభాగం
పద్మభూషణ్
ఎస్.ఎల్.భైరప్ప
(లిటరేచర్, విద్య) కర్ణాటక
కుమార మంగళం
బిర్లా (వాణిజ్యం) - మహారాష్ట్ర
దీపక్ ధార్
(సైన్స్ అండ్ ఇంజినీరింగర్ )- మహారాష్ట్ర
వాణీ జయరాం
(కళలు) - తమిళనాడు
చినజీయర్
స్వామి (ఆధ్యాత్మికం) - తెలంగాణ
సుమన్
కల్యాణ్ పూర్ (కళలు)- మహారాష్ట్ర
కపిల్ కపూర్ (లిటరేచర్, విద్య) - దిల్లీ
సుధామూర్తి
(సామాజిక సేవ) - కర్ణాటక
కమలేశ్ డి
పటేల్ (ఆధ్యాత్మికం) - తెలంగాణ
=======================
CLICK
FOR THE FULL LIST OF AWARDEES
=======================
0 Komentar