Reliance Jio Introduces Two New Prepaid Plans
With 2.5GB Daily Data: All Details Here
రిలయన్స్
జియో: నెల, మూడు నెలల వ్యాలిడిటీతో మరియు రోజుకు 2.5 జీబీ డేటా తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు – పూర్తి వివరాలు ఇవే
రిలయన్స్
జియో (Jio)
మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Prepaid plans) తీసుకొచ్చింది. రోజుకు 2.5 జీబీ వ్యాలిడిటీతో నెల, మూడు నెలల
వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. వాటి ధరలను రూ.349, రూ.899గా నిర్ణయించింది.
మొబైల్ లో ఎక్కువ డేటా వినియోగించే వారికి
ఈ ప్లాన్లు ఉపయోగకరం.
రూ. 349 ప్లాన్
రిలయన్స్
జియో తీసుకొచ్చిన రూ.349 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు
లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో
సెక్యూరిటీ సేవలు అందనంగా లభిస్తాయి. 5జీ నెట్
వర్క్ కవరేజీ అందుబాటులో ఉండీ 5జీకి సపోర్ట్ చేసే
మొబైల్ ఉంటే వెల్ కం ఆఫర్ కింద అపరిమిత 5జీ డేటాను
ఉచితంగా పొందొచ్చని జియో తెలిపింది.
రూ. 899 ప్లాన్
మూడు నెలల (90 రోజులు) వ్యాలిడిటీ కోరుకునే వారికోసం రూ. 899 ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. దీంట్లోనూ రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత
కాల్స్,
100 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ సేవలు అదనంగా లభిస్తాయి. ఈ ప్లాన్లోనూ 5జీ వెల్ కం ఆఫర్ లభిస్తుంది.
రూ. 2023 ప్లాన్
కొత్త ఏడాది
పురస్కరించుకుని తీసుకొచ్చిన రూ. 2023 ప్రీపెయిడ్ ప్లాన్లోనూ దాదాపూ ఇవే సదుపాయాలు లభిస్తున్నాయి. ఇది 252 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. 630జబీ డేటా లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేదు.
=====================
=====================
0 Komentar