Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC: Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2022 for 11409 Posts – All the Details Here

 

SSC: Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination, 2022 for 11409 Posts – All the Details Here

ఎస్ఎస్సీ - మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022 – 11409 పోస్టులకు పూర్తి వివరాలు ఇవే

===================

ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎన్ఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022

మొత్తం ఖాళీలు: 11409

1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్- టెక్నికల్): 10880

2) హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 529

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2023 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపుఉంటుంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (సెషన్-1, సెషన్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టి) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. సెషన్ 1కు నెగిటివ్ మార్కులు ఉండవు. సెషన్ 2 పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

1. ఆంధ్రప్రదేశ్: నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ.

2. తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 18.01.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 17.02.2023.

ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 19.02.2023.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2023, ఏప్రిల్.

===================

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags