Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana High Court Recruitment 2023 – Apply for 1226 Office Subordinate Posts - Details Here

 

Telangana High Court Recruitment 2023 – Apply for 1226 Office Subordinate Posts - Details Here

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 19,000-రూ. 58,850

======================

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం. 06/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 11న ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తుంది.

ఖాళీల వివరాలు:

ఆఫీస్ సబార్డినేట్: 1226 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

ఆదిలాబాద్- 10

భద్రాద్రి కొత్తగూడెం- 19

కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్- 36

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్- 125

సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్- 26

హనుమకొండ- 19

జగిత్యాల- 32

జనగామ- 13

జయశంకర్ భూపాలపల్లి- 18

జోగులాంబ గద్వాల- 25

కామారెడ్డి- 14

కరీంనగర్- 12

ఖమ్మం- 13

కుమ్రం భీం ఆసిఫాబాద్- 11

మహబూబాబాద్ - 13

మంచిర్యాల- 14

మహబూబ్ నగర్- 33

మెదక్- 16

మేడ్చల్-మల్కాజిగిరి- 92

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్- 128

ములుగు- 14

నాగర్ కర్నూలు- 28

నల్గొండ- 55

నారాయణపేట - 11

నిర్మల్- 18

నిజామాబాద్- 20

పెద్దపల్లి- 41

రాజన్న సిరిసిల్ల- 26

రంగారెడ్డి- 150 సంగారెడ్డి- 30

సిద్దిపేట - 25

సూర్యాపేట - 38

వికారాబాద్ - 27

వనపర్తి- 19

వరంగల్- 21

యాదాద్రి భువనగిరి- 34

అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ. 19,000-రూ. 58,850 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ / ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 30, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 15-02-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023

======================

NOTIFICATION

APPLY HERE

CAREER DETAILS

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags