TS POLYCET-2023:
ALL THE DETAILS HERE
టీఎస్ పాలీసెట్-2023:
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
06-07-2023
పాలీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పు – సీట్ల పెంపు – వివరాలు
ఇవే
తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ప్రభుత్వం మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త
కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక
విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు గురువారం(జులై
6) ఓ ప్రకటన విడుదల చేసింది.
పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్లోనూ పలు మార్పులు
చేసింది. శుక్రవారం (జులై 7న) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష
ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల పెంపు నేపథ్యంలో ఈ
షెడ్యూల్లో మార్పులు చేసినట్టు పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాబుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. జులై 10న పాలిసెట్ అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. జులై 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 14న తుది విడత పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్ల కేటాయిస్తారు.
=======================
UPDATE
25-06-2023
మొదటి విడత కౌన్సెల్లింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
=======================
UPDATE
10-06-2023
పాలీసెట్ కౌన్సెల్లింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే
మొదటి విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్: 14/06/2023 నుండి 18/06/2023 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 16/06/2023 నుంచి 19/06/2023 వరకు
వెబ్ ఆప్షన్లు: 16/06/2023 నుంచి 21/06/2023
సీట్ల కేటాయింపు: 25/06/2023
సెల్ఫ్ రిపోర్టింగ్: 25/06/2023 నుంచి 29/06/2023 వరకు
తుది విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్: 01/07/2023
ధ్రువపత్రాల పరిశీలన: 02/07/2023
వెబ్ ఆప్షన్లు: 01/07/2023 నుంచి 03/07/2023 వరకు
సీట్ల కేటాయింపు: 07/07/2023
సెల్ఫ్ రిపోర్టింగ్: 07/07/2023 నుంచి 10/07/2023 వరకు
DETAILED
COUNSELLING NOTIFICATION
=======================
UPDATE 26-05-2023
పాలిసెట్-2023 ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్ ఫలితాలు నేడు (మే 26) ఉదయం 11.30 గంటలకు విడుదల అయ్యాయి.
=======================
UPDATE 25-05-2023
పాలిసెట్-2023 ఫలితాలు విడుదల అప్డేట్
పాలిటెక్నిక్
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్ ఫలితాలు రేపు (మే 26) ఉదయం 11 గంటలకు విడుదల
కానున్నాయి. మే 17న 296 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరగ్గా, 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు.
=======================
UPDATE
18-05-2023
ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
=======================
UPDATE
17-05-2023
పరీక్ష తేదీ: 17/05/2023
=======================
04-05-2023
హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీ:
17-05-2023
ఆలస్య రుసుము
రూ.100తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14-05-2023
=======================
తెలంగాణ
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన
పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్థులు జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను
పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
కోర్సులు
అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్
పాలిటెక్నిక్స్ / ఇన్స్టిట్యూట్ లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎనీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర
ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ
విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా.
తెలంగాణ
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
అర్హత:
పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
పరీక్ష ఫీజు:
రూ.500,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ముఖ్యమైన తేదీలు. . .
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16-01-2023.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 24-04-2023.
ఆలస్య రుసుము
రూ.100తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25-04-2023, 14-05-2023
పరీక్ష
నిర్వహణ తేదీ: 17-05-2023.
=======================
=======================
0 Komentar