TS - Teachers
Transfers & Promotions 2023: All the Details Here
టీఎస్ - ఉపాధ్యాయుల బదిలీలు & పదోన్నతులు 2023: పూర్తి వివరాలు ఇవే
========================
UPDATE 14-09-2023
PROVISIONAL
VACANCIES LIST FOR GRADE-II HMs
PROVISIONAL
MERIT LIST FOR HMs
PROVISIONAL
MERIT LIST FOR OTHERS
TRANSFERS
SENIORITY LIST GRIEVANCE
========================
UPDATE
07-09-2023
DOWNLOAD
YOUR TRANSFER APPLICATION AS VERIFIED BY THE DEO
DEO ద్వారా ధృవీకరించబడిన మీ బదిలీ
దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవటానికి లింక్ ఇదే
========================
UPDATE 01-09-2023
TS Transfers / Promotions 2023: Revised Counselling
Schedule
తెలంగాణ లో
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను
విద్యాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 3 నుంచి 5 వరకు ఆన్లైన్
దరఖాస్తులు తీసుకోనుండగా.. 8, 9 తేదీల్లో
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత మార్చిలో దరఖాస్తులు
సమర్పించినవారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయనివారు
బదిలీ కోసం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు.
ముఖ్య తేదీల వివరాలు ఇవే
> నూతన దరఖాస్తు
/ పాత దరఖాస్తు మార్పుకి అవకాశం: 03/09/2023 నుండి 05/09/2023 వరకు
> సెప్టెంబరు
12,
13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.
> సెప్టెంబరు 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు.
> సెప్టెంబరు
17 నుంచి 19 వరకు స్కూల్
అసిస్టెంట్లకు హెచ్ఎంగా పదోన్నతులు.
> సెప్టెంబరు
20,
21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్
ఆప్షన్లు.
> సెప్టెంబరు
23,
24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు.
> సెప్టెంబరు
26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్
అసిస్టెంట్లుగా పదోన్నతి.
> సెప్టెంబరు
29 నుంచి అక్టోబరు 1 వరకు
ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.
> అక్టోబరు
3న ఎస్జీటీల బదిలీ.
> అక్టోబర్
5
నుంచి 19 వరకు అప్పీళ్లకు
అవకాశం.
CLICK
FOR PROCEEDINGS WITH SCHEDULE
========================
========================
PROCEEDINGS
26-01-2023 WITH GUIDELINES
========================
TRANSFERS
& PROMOTIONS GUIDELINES 26-01-2023
========================
ఉపాధ్యాయుల బదిలీలు & నియమాలు (తెలుగులో) – By B. Nageswara Rao Sir
========================
UPDATE
26-01-2023
ఉపాధ్యాయ దంపతులకు బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీపి
కబురు అందించింది. పెండింగ్ లో ఉన్న
దరఖాస్తులను పరిష్కరించాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 317 జీవో ప్రకారం కొత్త జిల్లాలకు అనుగుణంగా టీచర్లను కేటాయించారు. ఆ సందర్భంలో
భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. తమను ఒకే చోటుకు బదిలీ
చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2వేల మంది టీచర్లు దరఖాస్తు
చేసుకున్నారు.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్నగర్ తదితర 13 జిల్లాల్లోనే దంపతులు ఎక్కువగా
పనిచేసేందుకు మొగ్గు చూపారు. స్పౌజ్ కేటగిరీలో ఖాళీలను భర్తీ చేస్తే.. కొత్త
నియామకాలకు ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో ఆ 13 జిల్లాలను
ప్రభుత్వం బ్లాక్ చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల
ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ దంపతులు కొంతకాలంగా ఆందోళనలు
చేస్తున్నారు. వీరి అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఖాళీలు, 317 జీవోకు అనుగుణంగా ఉన్న 615 మంది ఉపాధ్యాయ దంపతులను బదిలీ
చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.
ప్రస్తుతం సూర్యాపేట మినహా 12 జిల్లాల్లోని
427 మందిని బదిలీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాబితా సిద్ధం
చేసి డీఈవోలకు పంపించింది.
========================
UPDATE 23-01-2023
తెలంగాణలో
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు
సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. అందుకు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో
దరఖాస్తులు స్వీకరించనుంది.
మార్చి 4వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తిచేయనుంది. మార్చి 5 నుంచి 19వరకు అప్పీళ్లకు
అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం
పేర్కొంది.
========================
తెలంగాణలో
ఈనెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల
ప్రక్రియ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం
సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవ సేన, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈనెల 27 నుంచి బదిలీల
ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రక్రియ
పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్
వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
తొలుత
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు జరుపుతారు. ఆ తర్వాత హెచ్ఎం ఖాళీలను స్కూల్
అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి బదిలీ చేస్తారు. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లకు
పదోన్నతులు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను బదిలీ చేస్తారు. రాష్ట్రంలో 2015
జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. 2018లో బదిలీలు
చేశారు. ఒకట్రెండు చిన్న మార్పులు తప్ప అప్పటి మార్గదర్శకాలనే అమలు చేయనున్నారు.
========================
పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్నవారికి ఈసారి బదిలీ లేదు
పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకుముందు రెండేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఉండేది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచినందువల్ల ఈసారి మూడేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటివరకు బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా, పదోన్నతులను ఆఫ్లైన్లో జరుపుతున్నారు. ఈసారి పదోన్నతులనూ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
========================
0 Komentar