APPSC: గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనల వివరాలు ఇవే
====================
ఏపీపీఎస్సీ
నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు
చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు
(CPT)
సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా
మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో
నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్
ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని
స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
వంద
మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా
భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్
సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర
అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో
స్పష్టం చేశారు.
====================
0 Komentar