Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EPFO Higher Pension Application Link Enabled & EPS 95- Higher Pension – FAQs

 

EPFO Higher Pension Application Link Enabled & EPS 95- Higher Pension – FAQs

ఈపీఎఫ్వో – అధిక పింఛను దరఖాస్తు లింకు ఇదే – అధిక పింఛను కు ఎవరు అర్హులు – సందేహాలు & సమాధానాలు

======================

ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు : సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్వో  ఆన్లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాచెల్లిస్తూ ఈపీఎస్ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారు అర్హులని పేర్కొంది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు గడువు మే 3గా పేర్కొంది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఆప్షన్ ఎలా చేయాలి?

వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్ మెంటరోపోర్టల్ హోంపేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్వో ఆదివారం (ఫిబ్రవరి 26) అర్ధరాత్రి ఏర్పాటు చేసింది. హోంపేజీలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకును క్లిక్ చేయాలి. ఆ తరువాత ఈపీఎస్ చట్టం 11(3) కింద ఆప్షన్కు దరఖాస్తును క్లిక్ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) ఖాతాద్వారా పూర్తిచేయాలి. చందాదారు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్వో రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండాలి. 4దశల్లో వివరాలు పూర్తిచేశాక దరఖాస్తు నంబరు వస్తుంది.

======================

REGISTRATION REQUEST FOR HIGH PENSION

UAN WEBSITE

======================

తాజా నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? తదితర సందేహాలు వస్తున్నాయి. ఈ మేరకు పింఛనుదారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రాంతీయ కార్యాలయాలకు చేరుకుని వివరాలు అడుగుతున్నారు. ఉద్యోగుల పింఛను పథకం-95 పై తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో నిబంధనలపై పింఛనుదారుల సమాఖ్య అడిగిన సందేహాలను ఈపీఎఫ్-కోచి ప్రాంతీయ కార్యాలయం నివృత్తి చేసింది. ఈ వివరాలను ఈపీఎస్-95 సేవా గ్రూపు క్రోడీకరించింది.

2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛనుకోసం దరఖాస్తు చేయవచ్చా?

దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్నపుడు ఈపీఎస్ చట్టం 11(3) నిబంధన కింద అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చి ఉండాలి. ఈ ఉమ్మడి ఆప్షన్ను ఈపీఎఫ్ తిరస్కరించి ఉండాలి. ఈ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.

2014 సెప్టెంబరు 1న, ఆ తరువాత పదవీ విరమణ చేసిన వారు దరఖాస్తుకు అర్హులా?

అధిక పింఛను కోసం ఇప్పుడు ఆప్షన్ ఇవ్వవచ్చు. అయితే 2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుండా, ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి (బేసిక్ + డీఏ)కి మించి వేతనం పొందుతూ ఉండాలి. వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ ఉండాలి.

ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చా?

2014 సెప్టెంబరు 1కి ముందు సభ్యులుగా చేరి, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించాలి. 2014 సెప్టెంబరు 1 తరువాత చేరిన వారు అధిక పింఛను సదుపాయం వినియోగించుకోలేరు.

అధిక పింఛనుకు ఆప్షన్ ఇచ్చినపుడు ఈపీఎఫ్ చట్టంలో పేరా 26(6) నిబంధన కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలన్నారు. ఇది ఏమిటి?

చట్టంలోని పేరా 26(6) ప్రకారం గరిష్ఠ పరిమితికి మించి వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈ నిబంధన వెసులుబాటు కల్పిస్తుంది. అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ముందుగా ఉద్యోగి, యజమాని కలిసి సంయుక్తంగా ఈపీఎఫ్్వకు దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తును ఏపీఎఫ్సీ ర్యాంకు.. ఆపై అధికారి ఆమోదించాలి. తాజాగా అధిక పింఛను కోరుకున్న ఉద్యోగులు 26(6) కింద ఆప్షన్ కచ్చితంగా ఇచ్చి ఉండాలి.

ఈపీఎస్ చట్టం -95 పేరా నం.II(3) కింద ఇచ్చిన ఆప్షనన్ను చట్టసవరణ అనంతరం పేరా నం.II(4) కింద ఏడాదిలోగా పునరుద్ధరించలేదు. వారికి ఇప్పుడు అవకాశం ఉంటుందా?

చట్టసవరణ తరువాత ఏడాదిలోగా 11(4) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులు ఆ అవకాశాన్ని సొంతంగా వదులుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధిక పింఛనుకు ప్రస్తుతం ఉమ్మడి ఆప్షన్ అవకాశం లేదు.

ఉద్యోగుల పింఛనునిధి చట్టంలోని పేరా II(3), II(4) ఏం చెబుతోంది?

జవాబు: ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్) చట్టం - 1995ని 2014లో సవరించారు. ఈ చట్ట సవరణకు ముందు 11(3) నిబంధన ప్రకారం 1995 నవంబరు 16 నుంచి ఉద్యోగి పొందుతున్న వాస్తవిక వేతనం గరిష్ఠ వేతన పరిమితికి మించి ఉన్నప్పుడు మూలవేతనం, డీఏ మొత్తంలో 8.33 శాతాన్ని ఈపీఎస్కు చందా చెల్లించాలి. ఈ మేరకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఈ నిబంధనను 2014 సెప్టెంబరు 1 తరువాత ఈపీఎస్ చట్టసవరణ ద్వారా తొలగించింది. అయితే వాస్తవిక వేతనంపై గతంలో 8.33 శాతం చందా చెల్లిస్తున్న వారు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని 11(4) కింద అవకాశం ఇచ్చింది. ఈ గడువును మరో ఆరు నెలల పాటు ఈపీఎఫ్వో  అప్పట్లో పొడిగించింది.

======================

EPS 95- Higher Pension – FAQs

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags