GPAT 2023 - Graduate Pharmacy Aptitude
Test - Check All the Details Here
ఎన్టీఏ-జీప్యాట్
2023
- అర్హత, ఎంపిక విధానం, పరీక్షా విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
========================
నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2023 ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా ఎంఫార్మా/ తత్సమాన
కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
గ్రాడ్యుయేట్
ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2023
అర్హత:
ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత. 2023-24 విద్యాసంవత్సరం ప్రవేశాలు మొదలయ్యేనాటికి బ్యాచిలర్స్
డిగ్రీ బీఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు. బీటెక్ (ఫార్మస్యూటికల్, ఫైన్ కెమికల్
టెక్నాలజీ)/ తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు. జీప్యాట్-2023 దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక
విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్
అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్షా
విధానం: 2023-24 విద్యాసంవత్సరానికి మాస్టర్స్(ఎంఫార్మా) కోర్సుల్లో
ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో వివిధ విభాగాలు ఉంటాయి. ఇందులో 125 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 500 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి
తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: జనరల్ పురుష అభ్యర్థులకు- రూ. 2200, జనరల్ స్త్రీ అభ్యర్థులకు- రూ.1100, ఇతర స్త్రీ పురుష అభ్యర్థులు రూ.1100 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2023.
ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేది: 06.03.2023.
పరీక్ష తేది:
వెల్లడించాల్సి ఉంది.
========================
========================
0 Komentar