New Department "Department of EWS
Welfare” - The Andhra Pradesh State and Subordinate Service Rules, 1996 -
Amendment to Rule-12
=====================
ప్రభుత్వ
ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ వారికి వయో పరిమితి ఐదేళ్లు పెంపు - ఏపీ రాష్ట్ర
సబార్డినేట్ సర్వీసు రూల్స్ సవరణ ఉత్తర్వులు జారీ
ఈడబ్ల్యూఎస్
యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు వయోపరిమితి తరహాలోనే ఆర్థికం గా బలహీన
వర్గాలకు కూడా ప్రభుత్వం నేరు గా భర్తీచేసే ఉద్యోగాలకు ఐదేళ్లు వయోపరిమితిని
పెంచింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోనూ సవరణలు చేస్తూ
శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం
ఓసీలకు నేరుగా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి 34 సంవత్సరాలుగా ఉంది.
ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాలకు 34 సంవత్సరాలకు అద నంగా మరో ఐదేళ్ల వయోపరిమితి
పెంచారు. అంటే ఆర్థికంగా బలహీనవర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి 39 సంవత్స
రాలుగా ఉండనుంది. మరోపక్క ఆర్థికంగా బలహీనవర్గాల సంక్షేమశాఖను ఏర్పాటు చేసిన
నేపథ్యంలో ఇప్పటికే ఆర్థికంగా బలహీ నవర్గాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన
కార్పొరేషన్లను ఆ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది.
=====================
The Andhra Pradesh State and Subordinate
Service Rules, 1996 - Amendment to Rule-12 - Notification - Orders
- Issued.
G.O.Ms.No.27, Dated:24-02.2023.
=====================
General Administration Department-
Cabinet- New Department i.e., "Department of Economically Weaker Sections
(EWS) Welfare" created with certain Welfare Corporations of Economically
Weaker Sections- Amendment to the Second Schedule of the Andhra Pradesh Government
Business Rules, 2018- Orders- Issued.
G.O.Ms.No.24, Dated: 23.02.2023
=====================
0 Komentar