OLA Launches New Variants of S1 & S1
Air E-Scooters – Details Here
ఓలా
ఎలక్ట్రిక్ S1 & S1 ఎయిర్ ఈ-స్కూటర్ల కొత్త వేరియంట్ల
వివరాలు ఇవే
========================
ఓలా
ఎలక్ట్రిక్ (Ola Electric) తన విద్యుత్
స్కూటర్ల శ్రేణిలో మార్పులు చేసింది. ఎస్1 (Ola s1) స్కూటర్ల శ్రేణిలో కొత్తగా 2kWh బ్యాటరీ ఆప్షన్
తో స్కూటర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం
ఉన్న ఎస్1,
ఎస్1 ప్రో వేరియంట్లకు అదనంగా ఎస్1 ఎయిర్ (Ola s1 Air) మూడు
వేరియంట్లు, ఎస్1లో (Ola
s1) ఒక వేరియంట్ ను తీసుకొచ్చింది. దీంతో ఇప్పటికే
ఉన్న ఎస్1,
ఎస్1 ప్రో (Ola s1 pro)తో కలిపితే మొత్తం ఆరు స్కూటర్లు అందుబాటులో ఉండనున్నాయి. 2kWh బ్యాటరీ కలిగిన ఎస్1 ఎయిర్ ధరను
రూ.84,999గా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించగా.. అదే బ్యాటరీ సామర్థ్యం
కలిగిన ఎస్1 స్కూటర్ ధరను రూ.99,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
ఎస్1 స్కూటర్ విషయానికొస్తే.. కొత్తగా 2kwh బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఓలా ఎస్1 సింగిల్ ఛార్జ్ 91 కిలోమీటర్లు (IDC) దూరం
ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇప్పటికే ఉన్న 3kwh బ్యాటరీ కలిగిన ఎస్1 స్కూటర్ తో సింగిల్
ఛార్జి 141
కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీని టాపీస్పీడ్ 95kmph.
ఇక ఎస్1 ఎయిర్ విషయానికొస్తే.. కొత్తగా మొత్తం మూడు బ్యాటరీ
ఆప్షన్స్ తో ఈ స్కూటర్ లభిస్తుంది. 2kWh వేరియంట్ తో 85 కిలోమీటర్లు, 3kh వేరియంట్ తో 125 కిలోమీటర్లు, 4kWh వేరియంట్తో 165 కిలో మీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ మూడు స్కూటర్లలో టాపీస్పీడ్
85 కిలోమీటర్లుగా పేర్కొంది. గతంలో ఎవరైతే 2.5 kWh బ్యాటరీ ప్యాక్ తో
కూడిన ఎస్1 ఎయిర్ ను బుక్ చేశారో వారు ఆటోమేటిక్ గా 3kwh బ్యాటరీకి అప్ గ్రేడ్ అవుతారని కంపెనీ తెలిపింది.
ఓలా
ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 185 కిలోమీటర్ల రేంజ్, గంటకు 116 కిలోమీటర్ల టాపీస్పీడ్ తో ప్రయాణిస్తుంది. వినియోగదారుల
నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాహన శ్రేణిని సవరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సహ
వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తెలిపారు. రోజుకు 20-30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారి కోసం కొత్తగా 2kwh బ్యాటరీ ఆప్షన్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. అన్ని ఎస్1 ఎయిర్ వేరియంట్ల బుకింగ్ నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు
తెలిపారు. వేరియంట్లను మార్చడం వల్ల డెలివరీలు మూడు నెలల ఆలస్యం కానున్నాయని
చెప్పారు.
========================
========================
Get ready for 4 times the excitement with our latest reveal 🛵 pic.twitter.com/ceAm8e30oZ
— Ola Electric (@OlaElectric) February 9, 2023
0 Komentar