Telangana Budget-2023:
Key Points
తెలంగాణ రాష్ట్ర
బడ్జెట్-2023: ముఖ్యాంశాలు మరియు శాఖల వారీగా కేటాయింపుల
వివరాలు ఇవే
========================
తెలంగాణ
శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget)ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.
రూ.2,90,396కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం
రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.
వ్యవసాయ
రంగానికి రూ.26,831 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,885 కోట్లు కేటాయించారు.
కీలకమైన దళితబంధు పథకానికి రూ.17,700కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 12వేల కోట్ల కేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా
అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని మంత్రి హరీశ్ చెప్పారు. మరోవైపు కాంట్రాక్టు
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను
క్రమబద్ధీకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.
2023 ఫిబ్రవరి,
6వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు 2023-24 వార్షిక
బడ్జెట్ సమర్పిస్తూ.. గౌరవనీయులు, ఆర్థిక శాఖామాత్యులు శ్రీ
తన్నీరు హరీశ్ రావు గారి ప్రసంగం
========================
కేటాయింపుల
వివరాలు ఇవే
> నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
> వ్యవసాయ రంగం రూ. 26,831 కోట్లు
> విద్యుత్ రంగం రూ.12,727 కోట్లు
> ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
> ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు
> దళితబంధుకు రూ.17,700 కోట్లు
> గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల
ప్రత్యేక ప్రగతినిధికి రూ.15,233 కోట్లు
> బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
> కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.3,210 కోట్లు
> మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
> మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
> హరితహారానికి రూ.1,471 కోట్లు
> విద్యారంగానికి రూ.19,093 కోట్లు
> వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు
> పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు
రూ.31,426 కోట్లు
> పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
> రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు
> పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
> హోం శాఖకు రూ.9,599 కోట్లు
> కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు
> కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు
========================
0 Komentar