TS - ALL CETs-2023 Schedule Here
తెలంగాణ లో
వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2023) షెడ్యూల్ ఇదే
=====================
UPDATE 09-02-2023
TS EAMCET-2023: ప్రథమ సంవత్సరం లో ని 70% సిలబస్ & ద్వితీయ సంవత్సరం లోని 100% సిలబస్ తో ఎంసెట్ పరీక్షలు
తెలంగాణలో మే
7 నుంచి జరిగే ఎంసెట్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు
ఇస్తారు. సెకండియర్ లో మాత్రం 100 శాతం
సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.
లింబాద్రి వెల్లడించారు.
ఎంసెట్
రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్ తోనే వార్షిక
పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్ లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందన్నారు.
=====================
తెలంగాణ రాష్ట్రం
లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
నిర్వహించనున్నారు. 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష జరగనుంది.
మే 18న ఎడ్ సెట్, మే 20న ఈసెట్, మే 25న లాసెట్, పీజీఎల్ సెట్, మే 26న ఐసెట్, మే 29 నుంచి జూన్1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత
విద్యామండలి తెలిపింది.
=====================
0 Komentar