TS EAMCET-2023: All the Details Here
టీఎస్
ఎంసెట్-2023:
పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
16-07-2023
TS EAMCET
2023: మొదటి విడత ఇంజినీరింగ్
సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
కాలేజీ వారీగా సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
తెలంగాణ ఎంసెట్-2023 కౌన్సెలింగ్ తొలి విడతలో
రాష్ట్రవ్యాప్తంగా 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల
తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా
మిగిలాయి.
సీటు పొందిన విద్యార్థులు జులై 22లోగా సెల్ఫ్
రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో
సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో 44.76, మెకానికల్లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
=======================
UPDATE 06-07-2023
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
షెడ్యూల్ లో మార్పు – సీట్ల పెంపు – వివరాలు ఇవే
తెలంగాణ
రాష్ట్రం లో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో
మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. రేపు, ఎల్లుండి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ కు
అవకాశం కల్పించారు. 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12వరకు పొడిగించారు. 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. 24 నుంచి రెండో విడత, ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి
ప్రకటనలో తెలిపింది.
=======================
UPDATE 25-07-2023
తెలంగాణ ఎంసెట్
(ఇంజనీరింగ్ కేటగిరీ) కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఎంసెట్
కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు వెల్లడించిన
సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల
చేశారు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్
జరగనుంది.
జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ
ప్రారంభంకానుండగా, జూన్ 26న ఆన్లైన్లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జూన్ 28 నుంచి జులై 6 వరకు
ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇక జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 12 నుంచి 19 వరకు ఆన్లైన్లో
సెల్ఫ్ రిపోర్టింగ్
రెండో విడత
కౌన్సెలింగ్ జులై 21 నుంచి మొదలవుతుంది.
జులై 21
నుంచి 24 వరకు రెండో విడత
వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ, జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు
2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలు
పెడతారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం
కల్పిస్తారు. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల
కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు
ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
ముఖ్యమైన తేదీలు:
ఇంజినీరింగ్ ప్రవేశాలు:
మొదటి విడత కౌన్సెల్లింగ్
తేదీలు:
ఆన్లైన్లో
కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్
బుకింగ్: 26/06/2023
ధ్రువపత్రాల
పరిశీలన: 28/06/2023 నుంచి 06/07/2023 వరకు
వెబ్
ఆప్షన్లు: 28/06/2023 నుంచి 08/07/2023
మొదటి విడత
ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 12/07/2023
ఆన్లైన్లో
సెల్ఫ్ రిపోర్టింగ్: 12/07/2023 నుంచి 19/07/2023 వరకు
రెండవ విడత కౌన్సెల్లింగ్
తేదీలు:
వెబ్
ఆప్షన్లు: 21/07/2023 నుంచి
24/07/2023
మొదటి విడత
ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 28/07/2023
తుది విడత కౌన్సెల్లింగ్
తేదీలు:
వెబ్
ఆప్షన్లు: 02/08/2023 నుంచి 04/08/2023
మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు: 07/08/2023
=======================
UPDATE 25-05-2023
తెలంగాణ
ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ
ఎంసెట్ ఫలితాలు నేడు (మే 25) ఉదయం 10.00
గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఇంజనీరింగ్ కేటగిరీ 👇
అగ్రికల్చర్ & మెడికల్ కేటగిరీ 👇
==================
UPDATE 23-05-2023
తెలంగాణ
ఎంసెట్-2023 ఫలితాల విడుదల అప్డేట్ ఇదే
తెలంగాణ
ఎంసెట్ ఫలితాలు 25న ఉదయం 11గంటలకు 9.30 కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి. కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ
కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత
విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, జేఎన్టీయూ-
హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల
చేయనున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారని
ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష
మే 12
నుంచి 15వరకు ఆరు విడతల్లో
ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే
ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి
అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు
దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.
=======================
UPDATE 15-05-2023
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కేటగిరీ 👇
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEYS
=======================
UPDATE
30-04-2023
హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు:
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్: 10-05-2023 & 11-05-2023 వరకు
ఇంజినీరింగ్: 12-05-2023 నుండి 14-05-2023 వరకు
=======================
తెలంగాణ
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్ సీహెచ్ ఈ) టీఎస్ ఎంసెట్-2023 ముఖ్యమైన తేదీలను విడుదల చేసింది. దీని ద్వారా
ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్
నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్)
నిర్వహిస్తోంది.
తెలంగాణ
స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్
మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్:
(టీఎస్
ఎంసెట్-2023):
అర్హత:
టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
పొందే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ! బయోటెక్నాలజీ/ బయోలజీ సబ్జెక్టులతో
ఇంటర్మీడియట్/ ఆప్షనల్, ఒకేషనల్ కోర్సులు
ఉత్తీర్ణత / డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 28-02-2023
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-03-2023
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 10-04-2023 (ఆలస్య రుసుం
లేకుండా).
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 02-05-2023 (ఆలస్య రుసుం తో).
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 30-04-2023 నుండి
పరీక్ష
తేదీలు:
అగ్రికల్చర్
అండ్ మెడిసిన్: 10-05-2023 & 11-05-2023 వరకు
ఇంజినీరింగ్: 12-05-2023 నుండి 14-05-2023 వరకు
=======================
=======================
0 Komentar