Union Budget 2023-24: Highlights & Key Features – What is Costlier and
Cheaper?
యూనియన్
బడ్జెట్ 2023-24 ముఖ్యాంశాలు ఇవే - బడ్జెట్ తర్వాత
ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
=======================
ఈరోజు ఫిబ్రవరి
01 న పూర్తిస్థాయి బడ్జెట్ 2023-24 ను
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
=======================
వస్తువుల
ధరలు??
ప్రభుత్వం
కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై
పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.
ఈ బడ్జెట్
ప్రకారం.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి..? వేటిపై భారం
పడనుందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
* కెమెరా
లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు
* టీవీ
పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం
* వెండిపై
దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం
* లిథియం అయాన్
బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు
* రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి
ధరలు తగ్గేవి
* మొబైల్, ల్యాప్టాప్, డీఎస్ఎల్ఆర్
కెమెరా లెన్సులు
* టీవీ
ప్యానెల్ పార్టులు
* లిథియం అయాన్
బ్యాటరీలు
* ఎలక్ట్రిక్
వాహనాలు
* దేశీయంగా
ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
* డైమండ్ తయారీ వస్తువులు
పెరిగేవి
* బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
* వెండి
ఉత్పత్తులు
* సిగరెట్లు, టైర్లు
* దిగుమతి
చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
* రాగి తుక్కు
* రబ్బర్
=======================
మహిళలు మరియు
సీనియర్ సిటిజన్ల కోసం కొత్త పథకాలు
మహిళలకు, వృద్ధులకు బడ్జెట్ లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల
కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అలాగే, సీనియర్ సిటిజన్లు డిపాజిట్ చేసే గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచింది.
మహిళల కోసం
ప్రత్యేకంగా ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్’ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని బడ్జెట్లో
కేంద్రం ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ
ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు
ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
సీనియర్
సిటిజన్లకు ‘సీనియర్ సిటిజన్ సేవింగ్’ స్కీమ్ కింద ప్రస్తుతం గరిష్ఠ పరిమితి రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంది. దీన్ని రూ.30 లక్షలకు వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ ప్రకటించారు.
మంత్లీ ఇన్
కమ్ స్కీమ్ పరిమితిని సైతం కేంద్రం సవరించింది. ఇప్పుడున్న 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు
పెంచారు. జాయింట్ అకౌంట్ కలిగిన వారికి ప్రస్తుతం ఉన్న రూ. 9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పథకంపై ప్రస్తుతం 7.10% వడ్డీ లభిస్తుంది.
=======================
ఆదాయపు పన్ను
వ్యక్తిగత
ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి ఈ సారి బడ్జెట్ లో కీలక మార్పులను ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్ లు దాఖలు చేసే సమయంలో 'కొత్త ఆదాయ పన్ను విధానం' డీఫాల్ట్ ఆప్షన్ గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు ఎప్పటిలా అందులో
పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను
పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్లో చేసిన మార్పులు ఈ
విధంగా ఉన్నాయి...
కొత్త పన్ను
విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు
పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో
ఎటువంటి మార్పు చేయలేదు.
కొత్త ఆదాయ
పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా..
వాటిని తాజాగా 5 కు కుదించారు.
రూ.3 లక్షల
వరకు ఎటువంటి పన్ను విధించరు. • రూ.3-6 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు.
రూ. 6-9
లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.
రూ.9-12
లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే
20శాతం పన్ను కట్టాలి.
• కొత్త
విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు
విధిస్తారు. ఉదాహరణకు 'ఎ' అనే వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందితే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను
ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ.7లక్షల వరకు
ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వార్షికాదాయం
రూ.15 లక్షలు ఉంటే రూ.1.5లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. గతంలో ఇది రూ.
1.87 లక్షల వరకు ఉంది. అత్యధిక ఆదాయపన్నుపై సర్ఛార్జి రేటును 37 శాతం నుంచి 25
శాతానికి తగ్గించారు.
పాత పన్ను
విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.52,500కు పెంచారు.
=======================
DOWNLOAD
KEY FEATURES OF BUDGET 2023-24
=======================
0 Komentar