UPSC Civil Services Examination 2023: All the Details Here
యూపీఎస్సీ - సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE
19-04-2024
UPSC సివిల్ సర్వీసెస్ 2023: ఎంపికైన అభ్యర్థుల మార్కుల వివరాలు విడుదల
======================
UPDATE
16-04-2024
సివిల్ సర్వీసెస్ 2023: తుది ఫలితాలు
విడుదల – మొత్తం 1016 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్-2023 పరీక్ష తుది
ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా
చాటారు. మహబూబ్ నగర్ కు చెందిన అనన్య
రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి
గాను మొత్తం 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా.. ఇందులో జనరల్
కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165, ఎస్టీ
కేటగిరీలో 86 మంది చొప్పున ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే
ఐఏఎస్ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా.. ఐఎఫ్ఎస్ కు 37, ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసు గ్రూప్-ఎ
కేటగిరీలో 613 మంది, గ్రూప్-బి సర్వీసులో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
మొదటి 10 ర్యాంకర్ ల వివరాలు ఇవే:
1. ఆదిత్య శ్రీవాస్తవ
2. అనిమేష్ ప్రధాన్
3. దోనూరు అనన్యరెడ్డి
4. పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్
5. రుహాని
6. సృష్టి దబాస్
7. అన్మోల్ రాథోర్
8. ఆశీష్ కుమార్
9. నౌషీన్
10. ఐశ్వర్యం ప్రజాపతి
======================
UPDATE 08-12-2023
సివిల్
సర్వీసెస్ మెయిన్స్ 2023 ఫలితాలు విడుదల
UPSC
ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2023 ఫలితాలను విడుదల చేసినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో
తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సివిల్స్ ప్రధాన పరీక్షలు జరిగిన విషయం
తెలిసిందే. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ
టెస్ట్)కు హాజరు కావాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ
అధికారిక వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థులకు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం- 2 అందుబాటులో ఉంటుందని, డిసెంబర్ 15లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది.
రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
CLICK
FOR RESULTS – ROLL NO WISE
======================
UPDATE 28-08-2023
మెయిన్స్ పరీక్షల
అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్షల తేదీలు:
15-09-2023 నుండి 24-09-2023 వరకు
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఈ-అడ్మిట్
కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్
ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు
అడ్మిట్ కార్డు లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు
ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15 నుంచి జరుగనున్న ఈ
పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులను కమిషన్ జారీ చేసింది. ఆగస్టు 28నుంచి సంబంధిత వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రోల్ నంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను
నమోదు చేయడం ద్వారా అడ్మిట్కార్డును పొందొచ్చు.
========================
UPDATE 12-06-2023
సివిల్
సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు విడుదల
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే 28న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ
ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్
పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు.
ప్రిలిమ్స్
ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్
అప్లికేషన్ ఫామ్ - 1 (DAF-I)లో దరఖాస్తు
చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే
వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని
సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు
యూపీఎస్సీ తెలిపింది.
CLICK
FOR WRITTEN TEST RESULTS
CLICK
FOR WRITTEN TEST RESULTS WITH NAME
========================
UPDATE
10-05-2023
అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్ష తేదీ: 28/05/2023
========================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి
దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి
ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నఅభ్యర్ధులు కూడా అర్హులే.
సివిల్
సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023
మొత్తం
ఖాళీలు: 1105.
సర్వీసులు:
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
2. ఇండియన్
ఫారిన్ సర్వీస్
3. ఇండియన్
పోలీస్ సర్వీస్
4. ఇండియన్
ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
5. ఇండియన్
సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
6. ఇండియన్
కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ'
7. ఇండియన్
డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
8. ఇండియన్
డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
9. ఇండియన్
ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
10. ఇండియన్
పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
11. ఇండియన్
పి&టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
12. ఇండియన్
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
13. ఇండియన్
రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్)
గ్రూప్ 'ఏ'
14. ఇండియన్
రెవెన్యూ సర్వీస్ (ఇనకం ట్యాక్స్) గ్రూప్ 'ఏ'
15. ఇండియన్
ట్రేడ్ సర్వీస్, గ్రూప్ 'ఎ' (గ్రేడ్-3)
16. ఇండియన్
రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
17. ఆర్మ్డ్
ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి' (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
18. దిల్లీ,
అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్,
డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ
సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి'
19. దిల్లీ,
అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్,
డామన్ & డయ్యూ, దాద్రా
అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్, గ్రూప్ 'బి'
20. పాండిచ్చేరి
సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి'
21. పాండిచ్చేరి
పోలీస్ సర్వీస్, గ్రూప్ 'బి'
అర్హతలు:
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ
చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా
ఉండాలి. అంటే 02-08-1991 నుంచి 01-08-2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అటెంప్టుల
సంఖ్య: జనరల్కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల (జీఎల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు
అపరిమితం.
ఎంపిక
విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష
విధానం: ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపరు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది.
ఉదయం,
మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో
ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైవ్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్
స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత
సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత
సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)
275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
రుసుము: ఓబీసీ / ఇతర అభ్యర్థులకు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు:
అనంతపురం,
హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ. ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 01.02.2023.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2023.
దరఖాస్తు
సవరణ తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు.
ప్రిలిమ్స్
పరీక్ష తేదీ: 28.05.2023.
========================
========================
0 Komentar