UPSC Indian Forest Service (IFS)
Examination 2023: All the Details Here
యూపీఎస్సీ - ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023: పూర్తి వివరాలు ఇవే
========================
UPDATE 12-06-2023
ఇండియన్
ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు విడుదల
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
CLICK
FOR WRITTEN TEST RESULTS
CLICK
FOR WRITTEN TEST RESULTS WITH NAME
========================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 ఉద్యోగాల భర్తీకి అర్హులైన
అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ
ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా
అర్హులే.
ఇండియన్
ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
ఖాళీలు:
సుమారు 150.
అర్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,
స్టాటిస్టిక్స్, జువాలజీ). లేదా బ్యాచిలర్
డిగ్రీ (అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా ఇంజినీరింగ్) లేదా
తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-08-2023 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్
ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.
దరఖాస్తు
రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది) .
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 01.02.2023.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 21.02.2023.
దరఖాస్తు
సవరణ తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023 వరకు.
ప్రాథమిక
పరీక్ష తేదీ: 28-05-2023.
=======================
========================
0 Komentar