ఏపీ
కేబినెట్లో ఆమోదించిన పలు అంశాల వివరాలు ఇవే (14-03-2023)
============================
మంగళవారం (మార్చి
14) సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ
మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు.
ఏపీ
కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే..
1. ఏప్రిల్
నెలలో పింఛన్లు 3వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయం.
ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంకు సెలవు, 2న ఆదివారం కావడంతో 3న పింఛన్లు పంపిణీ చేయుటకు నిర్ణయం.
2. పట్టాదారు
పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్
ఆమోదం.
3. షెడ్యూల్
కులాల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ లభించిందన్నారు. బీసీ కమిషన్, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్ ఛైర్మన్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ
చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
4. ఏపీ
మీడియా అక్రిడేషన్ నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం.
5. ఏపీ
పబ్లిక్ లైబ్రరీ చట్ట సవరణ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఏపీ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ ప్రతిపాదనను
కేబినెట్ ఆమోదం.
6. పాఠశాలల్లో
(High Schools) 5,388 మంది నైట్ వాచ్ మెన్ ల నియామకానికి కేబినెట్ ఆమోదం. నెలకు ఆరు
వేల రూపాయల గౌరవ వేతనం. టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం.
7. ఏపీ
పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ బిల్లు కు, 2023-27 నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
8. ఏపీ
వాటర్ వేస్ బిల్లుకు, అమలాపురం కేంద్రంగా
అర్బన్ డెవలప్మెంట్లో 120 గ్రామాలు విలీనం కి ఆమోదం.
9. ఏపీ
లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి ఆమోదం.
10. ఏపీ
అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణలకు ఆమోదం.
11. ఏపీ
రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణకు, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
12. దేవాలయాల్లో
నాయి బ్రాహ్మణులను పాలకమండలిలో సభ్యులు గా నియమించే ప్రతిపాదనకు ఆమోదం.
13. జిల్లా
గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు కి ఆమోదం.
14. ఎయిడెడ్
ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్
సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం.
15. ఏపీఐఐసీ
చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ ఆమోదం.
16. ఏపీ
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం.
17. ఎక్సైజ్
చట్టం సవరణకు ఆమోదం.
18. దేవాలయాల్లో
క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20 వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
============================
0 Komentar