BRAG INTER CET 2023: Inter Admissions
for Dr.B.R.Ambedkar Gurukulams and IIT-Medical Academies (Formerly APGPCET)
Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఇంటర్ ప్రవేశ పరీక్ష 2023 – పూర్తి వివరాలు ఇవే
=======================
=======================
UPDATE
09-05-2023
ఫలితాలు విడుదల
=======================
UPDATE
26-04-2023
పరీక్ష ‘కీ’ విడుదల
=======================
UPDATE
14-04-2023
హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 23-04-2023
=======================
ఆంధ్రప్రదేశ్
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్) పరిధిలోని 167 డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా. బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ- మెడికల్ అకాడమీల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాధ్యమం)
మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి 'బీఆర్ఎజీ
ఇంటర్ సెట్-2023' నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన
బాలబాలికలు ఆన్లైన్లో మార్చి 24 లోగా దరఖాస్తు
చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన
విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు
క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
డా.బీఆర్
అంబేడ్కర్ గురుకులం ఇంటర్మీడియట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023
ఇంటర్ గ్రూప్, సీట్లు: ఎంపీసీ - 5,650, బైపీసీ - 5,560, ఎంఈసీ - 800, సీఈసీ- 1600, హెచ్ సీ- 360.
మొత్తం సీట్ల
సంఖ్య: 13,970.
అర్హత:
విద్యార్ధులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాల్లో 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు
పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి. వయస్సు: విద్యార్ధి వయస్సు 31.08.2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఆదాయ
పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు .
రిజర్వేషన్ల
వివరాలు: ఎస్సీలకు 75%, బీసీ-సిలకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు
కేటాయించారు.
ఎంపిక
విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్
రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రశ్నపత్రం:
ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం - 25, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ-15, సోషల్స్టడీస్- 15, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్- 15 ప్రశ్నలు
అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
చివరి తేదీ: 24.03.2023, 31-03-2023
హాల్ టికెట్లు విడుదల తేదీ: 16.04.2023
ప్రవేశ
పరీక్ష తేది: 23.04.2023 (2.00PM to 4.30PM)
=======================
=======================
0 Komentar