Central Bank of India Recruitment 2023: Apply
for 5000 Apprentice Posts – Details Here
సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు
- దరఖాస్తు వివరాలు ఇవే
==========================
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్... దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్ షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అప్రెంటిస్: 5000 ఖాళీలు (తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్లో 141 ఖాళీలు ఉన్నాయి)
కేటగిరీ
వారీగా ఖాళీలు: ఎస్సీ- 763, ఎస్టీ- 416, ఓబీసీ - 1162, ఈడబ్ల్యూఎస్- 500, జనరల్- 2159.
శిక్షణ కాలం:
ఒక సంవత్సరం.
అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా
తత్సమాన
వయోపరిమితి: 31.03.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు
మూడేళ్లు,
దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్:
నెలకు రూ.10000 (రూరల్ బ్రాంచ్), రూ.12000 (అర్బన్ బ్రాంచ్), రూ.15000 (మెట్రో బ్రాంచ్) తో
పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల
పరిశీలన,
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష:
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్
ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు
అడుగుతారు.
దరఖాస్తు
రుసుము: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ముఖ్యమైన
తేదీలు…
ఆన్లైన్
రిజిస్ట్రేషను ప్రారంభ తేదీ: 20-03-2023
ఆన్లైన్
రిజిస్ట్రేషను చివరి తేదీ: 03-04-2023.
ఆన్లైన్
పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం, 2023.
==========================
==========================
0 Komentar