EPFO Recruitment 2023: Apply for 2674 Social
Security Assistant Posts – Details Here
ఈపీఎఫ్ వోలో
2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు - జీత
భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300.
=======================
న్యూదిల్లీలోని
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన
ఈపీఎఫ్ వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
సోషల్
సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ- గ్రూప్ సి): 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్
లో 39,
తెలంగాణ రీజియన్ లో 116 ఖాళీలు ఉన్నాయి)
కేటగిరీ
వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్సీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్
లకు 529,
అన్ రిజర్వ్డ్కు 999 కేటాయించారు.
అర్హత: ఏదైనా
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి
30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు
అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.29,200 - రూ.92,300.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్
టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష
విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు
కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు
అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దరఖాస్తు
రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది).
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-03-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 26-04-2023
=======================
=======================
0 Komentar