IBA
Women’s World Boxing Championship 2023: Nitu, Saweety, Nikhat and Lovlina Win
Gold
మహిళల ప్రపంచ
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023: స్వర్ణం గెలిచిన నీతు, సావీటీ, నిఖత్ మరియు లవ్లీనా
==========================
మహిళల ప్రపంచ
బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో ఇండియా కు 4 స్వర్ణాలు దక్కాయి.
1. నిఖత్ జరీన్
మహిళల ప్రపంచ
బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో నిఖత్ జరీన్ మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం 50 కేజీల ఫైనల్లో ఆమె 5-0 తేడాతో థీ థామ్ న్యూయెన్ (వియత్నాం)ను చిత్తుచేసింది. 26 ఏళ్ల నిఖత్.. తుదిపోరులోనూ జోరు కొనసాగించి ఏకపక్ష
విజయాన్ని అందుకుంది. 28 ఏళ్ల న్యూయెన్ కూడా
దీటుగా బదులివ్వడంతో ఈ బౌట్ హోరాహోరీగా సాగింది. ఒకరిని మరొకరు తోసేసుకోవడం, కింద పడిపోవడం, మెడను అణిచిపెట్టి
పంచ్లు విసరడం.. ఇలా ఈ మ్యాచ్ ఓ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. బాక్సర్లిద్దరూ
ఒక్కోసారి రిఫరీ నుంచి హెచ్చరిక (ఎల్లో కార్డు) కూడా అందుకున్నారు. తన ఎత్తును
అనుకూలంగా మార్చుకుని న్యూయెన్ గట్టిపోటీనిచ్చింది. నిఖత్ ను ఒకసారి తోసేసింది.
పడి లేచిన నిఖత్ అప్పర్కట్, హుక్ పంచ్లతో
చెలరేగింది. తన మెడను కిందకు వచ్చి.. న్యూయెన్ ఆధిపత్యం చలాయించాలని చూసినా నిఖత్
ఆగలేదు. ఎదురు దెబ్బలు తిన్నా.. తిరిగి లెక్క సరిచేసింది. తొలి రౌండ్లో నిఖతే
పూర్తి ఆధిపత్యం. రెండో రౌండ్లో ఆమె మరింతగా చెలరేగింది. ముఖంపై ఎడమ చేతి పంచ్లతో
రెచ్చిపోయింది. చివరి రౌండ్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు బాక్సర్లు ఒకరిపై
మరొకరు పడిపోతూ.. పంచ్లు ఇచ్చుకున్నారు. నిఖత్ కుడిచేత్తో బలంగా ఓ పంచ్ ఇవ్వడంతో..
ప్రత్యర్థికి దిమ్మతిరిగింది. దీంతో రిఫరీ ఎనిమిది అంకెలు (8 కౌంట్) లెక్కపెట్టిన తర్వాత మళ్లీ బౌట్ కొనసాగించింది. ఈ
సారి న్యూయెన్ బలంగా నిఖత్ కు పంచ్ ఇవ్వడంతో రిఫరీ మళ్లీ 8 కౌంట్ చేసింది. అయిదుగురు జడ్జీలూ నిఖత్ కే ఓటు వేయడంతో ఆమె
సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకుంది.
2. లవ్లీనా
బోర్గోహైన్
75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5-2తో కెల్లిన్ పార్కర్
(ఆస్ట్రేలియా)పై నెగ్గింది. రింగ్లో వేగంగా కదులుతూ.. అప్పర్కట్ పంచ్లతో లవ్లీనా
దాడి కొనసాగించింది. పటిష్ఠమైన డిఫెన్స్తో పాటు దూకుడైన అటాకింగ్ నైపుణ్యాలు
ప్రదర్శించింది. తొలి రౌండ్లో 3-2తో లవ్లీనాదే
పైచేయి. రెండో రౌండ్లో కాస్త నెమ్మదించినట్లు కనిపించిన లవ్లీనా అవకాశం కోసం ఎదురు
చూసింది. మరోవైపు కెల్లిన్ వేగం పెంచింది. లవ్లీనా ఎక్కువగా రక్షణాత్మకంగా
వ్యవహరించింది. దీంతో కైల్లిన్ రెండో రౌండ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక మూడో
రౌండ్లో లవ్లీనా ప్రాణం పెట్టి పోరాడింది. చివరకు బౌట్ సమీక్షలో లవ్లీనాకే జడ్జీలు
జై కొట్టారు.
3. నీతు ఘన్‌ఘాస్
శనివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో
జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల ఫైనల్‌లో
మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాన్‌సెట్సెగ్‌ను నీతు ఘన్‌ఘాస్ ఏకగ్రీవ
నిర్ణయంతో ఓడించింది. నీతూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్‌గా
నిలిచారు.
4. సావీటీ బూరా
మూడుసార్లు ఆసియా పతక విజేత సావీటీ బూరా 81 కిలోల ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాను స్ప్లిట్ తీర్పు ద్వారా
ఓడించింది.
==========================
𝐒𝐄𝐂𝐎𝐍𝐃 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳
— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023
SAWEETY BOORA beat Lina Wang of China in the FINAL 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @saweetyboora @BFI_official @Media_SAI @kheloindia pic.twitter.com/TUHqBhfUvf
𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳
— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023
NITU GHANGHAS beat Lutsaikhan Atlantsetseg of Mongolia by 5⃣-0⃣in the FINAL 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @NituGhanghas333 pic.twitter.com/5kpl6dUFzU
𝐂𝐎𝐍𝐒𝐄𝐂𝐔𝐓𝐈𝐕𝐄 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐍𝐈𝐊𝐇𝐀𝐓 𝐙𝐀𝐑𝐄𝐄𝐍 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐁𝐎𝐗𝐈𝐍𝐆 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023
𝐅𝐎𝐔𝐑𝐓𝐇 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023
TOKYO OLYMPIC MEDALIST LOVLINA BORGOHAIN beat Caitlin Parker of Australia in the 𝐅𝐈𝐍𝐀𝐋 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @LovlinaBorgohai pic.twitter.com/32kH07JIf2
0 Komentar