IRCTC eWallet: All the Details Here
ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్
– తెలుసుకోవలసిన విషయాలు ఇవే
======================
ట్రైన్
టికెట్ బుక్ సులభంగా చేసుకోడానికి ఐఆర్సిటీసీ ఇ-వ్యాలెట్ (IRCTC eWallet) ఆప్షన్ ని వెబ్సైట్ లో యాడ్ చేశారు. ఎక్కువ మంది టికెట్
బుకింగ్ సమయంలో బ్యాంక్ సర్వర్ డౌన్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో టికెట్ బుక్
అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. వీటికి ఐర్సిటీసీ ఇ-వ్యాలెట్ ఫుల్స్టాప్
పెడుతుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో క్షణాల్లో టికెట్ బుక్
చేసుకోవడానికి ఇ- వ్యాలెట్ ఉపయోపడుతుంది.
సాధారణంగా
రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు అకౌంట్లో జమ అవుతుంది.
అంటే మన డబ్బులు ఐఆర్ సీటీసీ దగ్గర కొన్ని రోజులు లాక్ అయినట్లే. ఈ లోగా మరో
టికెట్ చేసుకోవాలంటే మళ్లీ మన దగ్గర డబ్బులనే వాడుకోవాలి. అదే ఐఆర్ సీటీసీ
ఇ-వ్యాలెట్ నుంచి బుక్ చేసిన టికెట్లు క్యాన్సిల్ చేస్తే వెంటనే వ్యాలెట్ లో డబ్బు
జమవుతుంది.
ఐఆర్సీటీసీ
ఇ-వ్యాలెటు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత అకౌంట్ ను రెన్యువల్ చేసుకోవచ్చు.
దానికి ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
ఇ-వ్యాలెట్
వాడటం ఎలా?
1. ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి యూజర్ నేమ్, పాస్వర్డ్తో
లాగిన్ అవ్వాలి.
2. IRCTC eWallet మోనూలో Register Now పై క్లిక్ చేయాలి.
3. అందులో మీ ఆధార్ / పాన్ కార్డ్ నంబరు ఎంటర్ చేసి వచ్చిన OTP ని ఎంటర్ చేయాలి.
4. తర్వాత మీ రిజిస్ట్రేషన్ విజయవంతమైనట్టు మీకు మెసేజ్ స్క్రీన్ పై
వస్తుంది. .
5. ఆపై ఇ-వ్యాలెట్ లోకి మీకు కావాల్సినంత అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ‘IRCTC eWallet' మెనూలో 'IRCTC eWallet Deposit' పై క్లిక్ చేయాలి. కనిష్ఠంగా రూ.100 గరిష్ఠంగా రూ.10,000 వరకు జమ
చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని రైల్వేలో టికెట్ కొనుగోలు సమయంలో వినియోగించుకోవచ్చు.
6. ఇ-వ్యాలెట్ కొరకు కొత్త పాస్వర్డ్ అడుగుతుంది. దీన్ని టికెట్ బుకింగ్ పేమెంట్
సమయంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
======================
======================
0 Komentar