JOINT CSIR
UGC-NET December 2022 / June 2023: All the Details Here
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2022 / జూన్ 2023 - – పూర్తి వివరాలు ఇవే
=======================
సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు
అవకాశం కల్పించే... సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ (నెట్) డిసెంబర్-2022 / జూన్-2023కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
(ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం
కల్పించే జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం
నిర్వహించే పరీక్ష- సీఎస్ఐఆర్ యూజీసీ నెట్. ఈ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్ అర్హత
పొందితే సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో
పీహెచీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్షిప్కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు
లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా
ఎంపికకావచ్చు .
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2022 / జూన్-2023
సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో
నిర్వహిస్తారు.
1. కెమికల్ సైన్సెస్
2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
3. లైఫ్ సైన్సెస్
4. మ్యాథమేటికల్ సైన్సెస్
5. ఫిజికల్ సైన్సెస్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన
ఉత్తీర్ణులు / నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎన్- ఎంఎస్ / బీఈ / బీటెక్ / బీఫార్మసీ/
ఎంబీబీఎన్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం
మార్కులు పొందాలి.
వయసు: జేఆర్ఎఫ్ కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ
అభ్యర్థులకు 01.07.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/
ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు ఓబీసీ (నాన్క్రిమిలేయర్)లకు
మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/ లెక్చరర్షిప్కు
ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు
నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్
ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న
పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(ఎన్సీఎల్) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు
రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి
మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు...
ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023. 17.04.2023
పరీక్ష తేదీలు: 6, 7,
8.06.2023.
=======================
=======================
0 Komentar