MJPAPBC - 5th Class Admission 2023-2024:
All the Details Here
మహాత్మా
జ్యోతిబా ఫులే - ఏపీ బీసీ
గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు – పూర్తి
వివరాలు ఇవే
=======================
UPDATE 13-05-2023
పరీక్ష ఫలితాలు
విడుదల
=======================
UPDATE
13-04-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 16-04-2023
=======================
మహాత్మా
జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి (ఇంగ్లిషు మీడియం, స్టేట్ సిలబస్)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన
వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు
ఏప్రిల్ 4లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
మహాత్మా
జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
విద్యార్హత:
విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన
పాఠశాలలలో నాలుగో తరగతి 2022-23 విద్యా సంవత్సరంలో
చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని
పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయస్సు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల
మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల
మధ్య ఉండాలి.
ఆదాయ
పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు.
ప్రవేశ
పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు / ఆంగ్ల
మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు (10 మార్కులు), ఇంగ్లిష్ (10 మార్కులు), గణితం(15 మార్కులు), పరిసరాల విజ్ఞానం(15 మార్కులు)
సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా
కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.
ఎంపిక
విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక
కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.100.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 05-03-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2023.
ప్రవేశ
పరీక్ష తేదీ: 16-04-2023.
=======================
=======================
0 Komentar