NEET-UG 2023: All the Details Here
నీట్ (యూజీ)
- 2023:
పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 14-06-2023
నీట్ యూజీ -2023 ఫలితాలు విడుదల
నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె. యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. NEETకు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది. ఈ ఏడాది నీటు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది అభ్యర్థులు ఉన్నారు.
వైద్య విద్యా
కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న
నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు
హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్షర్ కీని
విడుదల చేసిన NTA.. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం
తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు. అబ్బాయిలదే
హవా నీట్ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలే హవా చాటారు. టాప్ 50 అభ్యర్థుల్లో 40 మంది అబ్బాయిలే ఉండగా.. 10మంది అమ్మాయిలు
ఉన్నారు. అమ్మాయిల్లో పంజాబ్కు చెందిన ప్రంజల్ అగర్వాల్ (4వ ర్యాంకు), అషికా
అగర్వాల్ (11వ ర్యాంకు) 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
టాప్ 20 ర్యాంకర్లు వీరే..
1. ప్రభంజన్
జె (720 మార్కులు)
2. బోరా
వరుణ్ చక్రవర్తి (720)
3. కౌస్తవ్
బౌరి (716)
4. ప్రంజల్
అగర్వాల్ (175)
5. ధ్రువ్
అడ్వానీ (715)
6. సూర్య
సిద్ధార్థ్ (715)
7. శ్రీనికేత్
వి (715)
8. స్వయం
శక్తి త్రిపాఠి (715)
9. వరుణ్
ఎస్ (715)
10. పార్ట్
ఖండేవాల్ (715)
11. అషికా అగర్వాల్ (715)
12.
సాయన్ ప్రధాన్ (715)
13. హర్షిత్
బన్సల్ (715)
14. శంకర్
కుమార్ (715)
15. కేసీ
రఘురామ్ రెడ్డి (715)
16. శుభమ్
బన్సల్ (715)
17.
భాస్కర్ కుమార్ 715)
18. దేవ్
భాటియా (715)
19. అర్నాబ్ పటి (715)
20. శశాంక్
సిన్హ (715)
======================
UPDATE 04-05-2023
పరీక్ష హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీ:
07-05-2023
======================
నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అండర్
గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
నేషనల్
ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ)-2023
అర్హత:
సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. 31.12.2005 తర్వాత జన్మించి ఉండాలి.
ఎంపిక
విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష
మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు.
పరీక్షా
విధానం: నీట్ (యూజీ) 2023 పరీక్షలో నాలుగు
సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు (సెక్షన్ ఏ, సెక్షన్ బీ) ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో
ఉంటాయి. మొత్తం - 200 ప్రశ్నలకుగాను 3 గంటల 20 నిమిషాలు సమయం
ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 06.03.2023
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 06.04.2023, 15.04.2023
పరీక్ష తేది:
07.05.2023
పరీక్ష సమయం:
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు.
======================
======================
0 Komentar