Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIMCET-2023: NIT MCA COMMON ENTRANCE TEST 2023 – ALL THE DETAILS HERE

 

NIMCET-2023: NIT MCA COMMON ENTRANCE TEST 2023 – ALL THE DETAILS HERE

నీమ్ సెట్-2023: నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - పూర్తి వివరాలు ఇవే

========================

దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్ఐటీలలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్) నిర్వహిస్తున్నాయి. ఇటీవలే నిమ్ సెట్-2023 ప్రకటన వెలువడింది. ఈ ఏడాది నిమ్ సెట్ ను నిట్, జంషెడ్పూర్ నిర్వహిస్తోంది..

నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్) - 2023

తొమ్మిది నిట్ లలో ప్రవేశం: నిమ్ సెట్ తో 9 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్ ఒకటి. దేశీయ, విదేశీ ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్ ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్ అనుసరిస్తాయి. నిట్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

నిట్ లలో సీట్ల వివరాలు: అగర్తలా- 30, అలహాబాద్ - 116, భోపాల్ - 115, జంషెడ్పూర్ - 115, కురుక్షేత్ర - 96 (వీటిలో 32 సెల్ఫ్ ఫైనాన్స్), రాయ్పూర్ - 110, సూరత్కల్ - 58, తిరుచురాపల్లి - 115, వరంగల్ - 58.

మొత్తం సీట్ల సంఖ్య: 813.

అర్హత: మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మ్యాథమేటిక్స్ నుంచి 50 ప్రశ్నలు, ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40, కంప్యూటర్ అవేర్ నెస్ నుంచి 20, జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలడుగుతారు. మొత్తం 1000 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది.

సీట్ల కేటాయింపు: మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 05/03/2023

ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ: 10/04/2023 .

పరీక్ష తేది: 11/06/2023

ఫలితాల ప్రకటన: 16/06/2023

========================

BROCHURE

REGISTRATION

LOGIN

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags