Oscars 2023: Check the Full Winners List
Here – RRR’s ‘Naatu Naatu’ Wins in Original Song Category
ఆస్కార్స్ 2023: 'ఆర్ఆర్ఆర్’ ‘నాటు నాటు'కు ఆస్కార్ – పూర్తి విజేతల జాబితా ఇదే
==========================
ఎంతో ఆతృతగా
ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల
వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకధీరుడు
రాజమౌళి,
సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షితో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
‘నాటు నాటు'కు ఆస్కార్..
ఆస్కార్
అవార్డుల వేడుకలో 'నాటు నాటు...' (Naatu Naatu
Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా
అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన 'అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), 'లిఫ్ట్ మి అప్' (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ
లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్', 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్లన్ మావెరిక్)
పాటలను వెనక్కి నెట్టి 'నాటు నాటు..'(RRR)కు ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో
'నాటు నాటు' ప్రకటించగానే డాల్బీ
థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆనందోత్సాహల్లో
మునిగిపోయింది.
ఇండియా కి మరో
అవార్డు
బెస్ట్
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'ను ఆస్కార్
వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్
విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా
పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ
ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల
నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఈ షార్ట్ ఫిల్మ్ ను
తెరకెక్కించారు.
నాటు నాటు
పెర్ఫామెన్స్
డాల్బీ
థియేటర్‌లో 'నాటు నాటు' సాంగ్‌కు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆస్కార్
వేదికపై 'ఆర్ఆర్ఆర్' సాంగ్ లైవ్
ప్రదర్శన ఇచ్చేసరికి థియేటర్ మొత్తం క్లాప్స్‌తో దద్దరిల్లింది.
ఉత్తమ నటుడు,
ఉత్తమ నటి & ఉత్తమ చిత్రం
ఉత్తమ
నటుడిగా బ్రెండన్ ప్రాసెర్ (ది వేల్) ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో
బ్రెండన్ ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్
ఫార్రెల్ (ది బర్జీష్ ఆఫ్ ఇని షెరిన్), బిల్ నిగీ
(లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ
పడ్డారు. అయితే, 'ది వేల్' చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ ను ఆస్కార్
వరించింది.
ఉత్తమ నటిగా 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమా లో నటించిన మిచెల్లీ యోహో కు ఆస్కార్ దక్కింది.
ఈ ఏడాది
ఆస్కార్ అవార్డుల వేడుకలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్
వన్స్'
చిత్రం అదరగొట్టింది. ఇప్పటికే పలు కేటగిరిల్లో అవార్డులను
దక్కించుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్లు ఉత్తమ దర్శకులుగా అవార్డును
అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా మిచెల్లీ యోహో కూడా పురస్కారాన్ని దక్కించుకుంది.
==========================
పూర్తి విజేతల జాబితా ఇదే
ఉత్తమ నటుడు:
బ్రెండన్ ప్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి: మిచెల్లీ
యోహో ('ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్')
ఉత్తమ చిత్రం: 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'
ఉత్తమ దర్శకుడు:
డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్ ('ఎవ్రీథింగ్
ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్')
బెస్ట్
ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (RRR)
బెస్ట్
సౌండ్: మార్క్ వెయిగార్టెన్, జేమ్స్ హెచ్.మాథర్, అల్ నెల్సన్, క్రిస్
బర్డన్,
మార్క్ టేలర్ (టాప్ గన్: మావరిక్)
బెస్ట్
అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: సరా పొల్లే (ఉమెన్ టాకింగ్)
బెస్ట్
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: డేనియల్ క్వాన్, డేనియల్
చైనెర్ట్ (ఎవెరీథింగ్ ఎవెరీవేర్ ఆల్ ద వన్స్)
అవతార్: ది
వే ఆఫ్ వాటర్‌కు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్
బెస్ట్
ఒరిజినల్ స్కోర్: వోల్కర్ బెర్టెల్‌మ్యాన్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టరన్ ఫ్రంట్)
బెస్ట్
ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టరన్ ఫ్రంట్
బెస్ట్
యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ద హార్స్
బెస్ట్
డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’
బెస్ట్
ఇంటర్నేషనల్ ఫిలిం: ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టరన్ ఫ్రంట్ (జర్మనీ)
ఉత్తమ
కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ ఇ కార్టర్
బెస్ట్
సపోర్టింగ్ యాక్టర్: కే హుయ్ క్వాన్
ఆస్కార్
బెస్ట్
హెయిర్ &
మేకప్: 'ది వేల్'
ఉత్తమ
సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ లైవ్
యాక్షన్ షార్ట్ ఫిల్మ్: 'యాన్ ఐరిష్ గుడ్‌బై'
బెస్ట్
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నావల్నీ
బెస్ట్
యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: గులెమ్రో దెల్ తోరోస్ పినోచియో
==========================
==========================
0 Komentar