SSC Recruitment 2023 – Apply for 5369 Selection Posts (Phase
XI) – Details Here
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 5369 సెలక్షన్
పోస్టులు (ఫేజ్-XI) - పూర్తి వివరాలు ఇవే
========================
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్
గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా
భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర
ప్రభుత్వ విభాగాల్లో పనిచేయుటకు 5369 సెలక్షన్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 5369
పోస్టులు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా
ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్
సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్
అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్
వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్లు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు
వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ
టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్
అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి
25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 27.03.2023
ఆన్లైన్ పేమెంట్ చివరి తేది: 28.03.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జూన్-జులై 2023.
ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 11 ని చూడండి.
========================
========================
0 Komentar