Union Health Ministry Issues a Heatwave
Health Advisory to States & UTs in View of
Unusual High Temperature & Heat-Related
Illnesses
దేశంలో రానున్న రోజుల్లో అసాధారణమైన ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హీట్‌వేవ్ హెల్త్ అడ్వైజరీ జారీ
========================
ఎండ ఎక్కువ వల్ల పిల్లల్లో
& పెద్దల్లో కనిపించే సంకేతాలు ఇవే
ఇండియాలోని
వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థితికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ
కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ
రాశారు. "నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కింద
అన్ని జిల్లాల్లోనూ సమీకృత ఆరోగ్య సమాచార వేదిక ఏర్పాటుచేయాలి. వడగాడ్పులకు గురైన
వారి వివరాలు, మరణాలను నిబంధనల ప్రకారం
రూపొందించాలి.
నేషనల్
ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి జారీ అయ్యే వడగాడ్పుల తీవ్రత
వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి ఆసుపత్రులకు తెలియజేయాలి. వడగాడ్పుల వల్ల
ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా, నగరస్థాయి వైద్యఆరోగ్య విభాగాలు
ప్రణాళికలు రూపొందించుకొని అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలి. వైద్యాధికారులు, వైద్యసిబ్బంది, క్షేత్రస్థాయిలో
పనిచేసే సిబ్బందికి వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల తీవ్రత గురించి అవగాహన
కల్పించి ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, నివారణ
చర్యలు తీసుకొనేలా చూడాలి. ఇందుకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
రూపొందించిన శిక్షణ విధానాలను అనుసరించాలి. ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలు, ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన
పరికరాలు,
తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి" అని రాజేష్
భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
========================
ఎండ వల్ల
పెద్దల్లో కనిపించే సంకేతాలు ఇవే
1. అయోమయం, గందరగోళంతో పాటు మతిస్థిమితం తప్పినట్లు వ్యవహరించడం, ఆందోళన, చికాకు, మూర్చ, కోమా
2. పొడిచర్మం.
3. శరీర
ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారిన్
హైట్కు చేరడం
4. దడపుట్టించేలా
తలనొప్పి
5. ఆందోళన, మైకం, తేలికపాటి తలనొప్పి.
6. కండరాల్లో
బలహీనత, తిమ్మిరి
7. వికారం, వాంతులు.
8. గుండె స్పందనలో, శ్వాసలో వేగం పెరగడం
========================
ఎండ వల్ల
పిల్లల్లో కనిపించే సంకేతాలు ఇవే
1. ఆహారం
తీసుకోవడానికి విముఖత చూపడం.
2. విపరీతమైన
చిరాకు
3. మూత్ర
విసర్జన పరిమాణం తగ్గిపోవడం
4. నోరు,
కళ్లు పొడిబారడం, కన్నీళ్లు
కనిపించకపోవడం.
5. బద్ధకంగా
ఉండటం. చురుకుదనం లోపించడం.
6. మూర్చ
7. శరీరంలో
ఎక్కడి నుంచైనా రక్తస్రావం కావడం
========================
0 Komentar