WhatsApp’s to Allow
Silencing Spam Calls from Unknown Numbers
వాట్సాప్: స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ – వివరాలు
ఇవే
========================
స్పామ్
కాల్స్ సాధారణ కాల్స్ రూపంలో వస్తుంటాయి. కొన్ని ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ
యాప్స్ వల్ల అలాంటి కాల్స్ ను గుర్తించడం
వీలు పడుతోంది. దీంతో అలాంటి కాల్స్ ను బ్లాక్ చేసే సదుపాయం అందుబాటులోకి
వచ్చింది. ఒకసారి బ్లాక్ చేస్తే మళ్లీ అదే నంబర్ నుంచి కాల్స్ రావు. దీంతో స్పామ్
కాల్ చేసే వారు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నేరుగా వాట్సాప్ నంబర్లకే కాల్
చేస్తున్నారు. ఏ నంబరైనా కాల్ చేసే వెసులుబాటు వాట్సాప్ కల్పిస్తుండడంతో ఎలాంటి
అంతరాయం లేకుండా కాల్స్ అందుకునే వెసులుబాటు దొరుకుతోంది. ఇలాంటి కాల్స్ కు చెక్
పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
సైలెన్స్
అన్నోన్ కాలర్స్ పేరిట ఈ ఫీచర్ను వాట్సాప్ తీసుకొస్తోందని వాబీటా ఇన్ఫో వెబ్సైట్
తెలిపింది. ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్కు రింగ్ రాకుండా ఈ
ఫీచర్ నిరోధిస్తుంది. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు కేవలం నోటిఫికేషన్ బార్ లో
మాత్రమే కనిపిస్తుంది. అంటే మన ఫోన్ నంబర్ల జాబితాలో లేని ఎవరైనా కొత్త వ్యక్తులు
మనకు ఫోన్ చేసినప్పుడు మీకు రింగ్ రాదన్నమాట. ఒకవేళ ఏదైనా విషయం చెప్పదలచుకుంటే
మెసేజ్ రూపంలో తెలియజేస్తే అప్పుడు యూజర్ తన ఇష్టం మేరకు తిరిగి కాల్ / మెసేజ్
చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లతో దీన్ని
పరీక్షిస్తున్నారు. ఐఓఎస్ యూజర్లకూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
========================
WhatsApp is working on a feature to mute calls from unknown numbers!
— WABetaInfo (@WABetaInfo) March 5, 2023
WhatsApp is developing a new feature that allows users to silence calls from unknown numbers, for a future update of the app.https://t.co/Us5Bm11snF
0 Komentar