Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Happiness Report-2023: Finland Tops For 6th Straight Year, Check India's Rank Here

 

World Happiness Report-2023: Finland Tops For 6th Straight Year, Check India's Rank Here

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2023: ఆనందకర దేశాల్లో వరుసగా 6వ సారి ఫిన్‌లాండ్ నెం.1, భారత్‌ ర్యాంక్‌ ఇదే

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమతి (UN) గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా 2023 ఏడాదికి నివేదికను విడుదల చేసింది.

మొత్తం 150 దేశాల్లోని డేటాను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. గతేడాది 136వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకోవడం గమనార్హం. పొరుగు దేశాలైన చైనా(74), నేపాల్ (119), శ్రీలంక (63), బంగ్లాదేశ్(102) భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.

మళ్ళీ నెం.1 ఫిన్లాండ్

ఈ జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. అగ్ర రాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి ఒక స్థానం మెరుగుపరుచుకుని 15వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో లైబీరియా, జింబాబ్వే, కాంగో అట్టడుగున ఉన్నాయి. రష్యా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్.. ఆనందకర దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది. రష్యా 72వ స్థానం దక్కించుకుంది.

2012 నుంచి ఐరాసకు చెందిన 'సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్' ఏటా ప్రపంచ ఆనంద నివేదికను వెల్లడిస్తోంది. గత మూడేళ్ల వ్యవధిలో ఆయా దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, కుటుంబ జీవనం, మానసిక ఆరోగ్యం, జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. కొవిడ్ పరిస్థితుల తర్వాత చాలా వరకు ప్రజల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మద్దతుగా నిలవడం పెరిగిందని ఈ నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన జాన్ హెల్లీవెల్ చెప్పారు.

TOP 20 COUNTRIES: 👇

(1.) ఫిన్లాండ్

(2.) డెన్మార్క్

(3.) ఐస్‌లాండ్

(4.) ఇజ్రాయెల్

(5.) నెదర్లాండ్స్

(6.) స్వీడన్

(7.) నార్వే

(8.) స్విట్జర్లాండ్

(9.) లక్సెంబర్గ్

(10.) న్యూజిలాండ్

(11.) ఆస్ట్రియా

(12.) ఆస్ట్రేలియా

(13.) కెనడా

(14.) ఐర్లాండ్

(15.) యునైటెడ్ స్టేట్స్

(16.) జర్మనీ

(17.) బెల్జియం

(18.) చెక్ రిపబ్లిక్

(19.) యునైటెడ్ కింగ్‌డమ్

(20.) లిథువేనియా

==========================

REPORT 2023

RANKING DETAILS

WEBSITE 1

WEBSITE 2

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags