AIIMS NORCET Recruitment 2023: Apply for
3055 Nursing Officer Posts – Details Here
ఎయిమ్స్ లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 44,900-1,42,400
========================
న్యూదిల్లీలోని
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న
ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్
రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్) - 4 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్ధులు మే 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నర్సింగ్ ఆఫీసర్: 3,055 పోస్టులు
సంస్థల
వారీగా ఖాళీల వివరాలు:
1. ఎయిమ్స్ భటిండా- 142
2. ఎయిమ్స్ భోపాల్- 51
3. ఎయిమ్స్ భువనేశ్వర్- 169
4. ఎయిమ్స్ బీబీనగర్- 150
5. ఎయిమ్స్ బిలాస్పూర్ - 178
6. ఎయిమ్స్ దేవఘర్- 100
7. ఎయిమ్స్ గోరఖ్ పూర్- 121
8. ఎయిమ్స్ జోధ్పూర్ - 300
9. ఎయిమ్స్ కల్యాణి- 24
10. ఎయిమ్స్ మంగళగిరి- 117
11. ఎయిమ్స్ నాగుర్- 87
12. ఎయిమ్స్ రాయ్ బరేలీ - 77
13. ఎయిమ్స్ న్యూదిల్లీ- 620
14. ఎయిమ్స్ పట్నా- 200
15. ఎయిమ్స్ రాయ్పూర్- 150
16. ఎయిమ్స్ రాజ్కోట్- 100
17. ఎయిమ్స్ రిషికేశ్- 289
18. ఎయిమ్స్ విజయ్ పూర్- 180
అర్హత:
డిప్లొమా (జీఎన్ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/
బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్
ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై
ఉండాలి.
వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్ధులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు అయిదేళ్ల
సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ. 44,900-1,42,400
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ
అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: నార్సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు.
ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు
ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి 20 ప్రశ్నలు
అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12.04.2023
ఆన్లైన్ దరఖాస్తు చివరి
తేదీ:05.05.2023
సీబీటీ పరీక్ష తేదీ: 03.06.2023.
========================
========================
0 Komentar