Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP CM Review on Educational Department 10-04-2023 – Details Here

 

AP CM Review on Educational Department 10-04-2023 – Details Here

విద్యా శాఖపై సమీక్ష 10-04-2023 – వివరాలు ఇవే

==========================

విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పిల్లలు పాఠశాలలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. ఇలా ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యాశాఖపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

1. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యా కానుకపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు మే 15 నాటికి పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని తెలిపారు. సబ్జెక్టు టీచర్లపైనా సీఎం సమీక్షించారు.

2. సబ్జెక్టు టీచర్లకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సుల ఏర్పాటుకు సీఎం జగన్ అనుమతిచ్చారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు ఉంటుందని.. వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందని అధికారులు వివరించారు.

3. పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. ఏటా దీనిపై సమీక్షించుకోవాలని.. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలని నిర్దేశించారు. పిల్లలకు ఎక్కడ కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్నారు.

4. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుపై సమీక్షించిన జగన్.. జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్పీలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం సమీక్షించారు. చిన్నారులకు మూడు దశల్లో టోఫెల్ పరీక్షలు జరపాలని సీఎం జగన్ సూచించారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ-కంటెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు.

5. ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్నారు. ఇప్పటికే వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లను కూడా అఫిలియేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

CM REVIEW DETAILS

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags