బాలచెలిమి
పర్యావరణ కథల పోటీలు - 2023
======================
బాలచెలిమి
పిల్లల వికాస పత్రిక వారు నిర్వహించే బాలచెలిమి
పర్యావరణ కథల పోటీలు - 2023
వినోదం, విజ్ఞానం, వికాసం పిల్లల్లో
కల్గించాలనే లక్ష్యంగా బాలచెలిమి దశాబ్దాలుగా పత్రికతో పాటు వివిధ కథా సంకలనాలను
వెలువరించింది. ఈ కథా సంకలనాలు రెండు రాష్ట్రాల్లో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి.
మనం మన
నాగరికత ఎంత అభివృద్ధి చెందిన సాంకేతికంగా ఎంతగానో ఎదిగిన మన జీవితాలకు
పెనుముప్పులు ఏర్పడి మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మిగులుతున్నాయి.
భవిష్యత్
తరాల కోసం మన వంతు బాధ్యతగా చిన్న నాటి నుండే వారి లోపల పర్యావరణ పరిరక్షణ కోసం
అవగాహన,
ఆలోచన కల్పించడానికి గానూ, శబ్ద,
జల, వాయు కాలుష్యాలు, అడవులు అంతరించడం, ప్లాస్టిక్
వినియోగం,
జీవ వైవిధ్య రసాయన ఎరువులు, గుట్టలుగా పెరుగుతున్నా వ్యర్థ పదార్థాలు, పంటలు, భూతాపం, ఇంకా అనేక సమస్యలు, కాన్సర్ వంటి వ్యాధులు ఇతరత్రా అనేకం మనల్ని
భయపెడ్తున్నాయి.
కావున పై
అంశాల్ని దృష్టిలో ఉంచుకొని చక్కటి చిక్కటి కథలుగా రాసి పంపాలని బాలచెలిమి
విన్నవిస్తుంది. ఉత్తమంగా అన్పించిన వాటిని సంకలనాలుగా తెస్తామని ప్రకటిస్తుంది.
సూచనలు
అంశం:
1. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏ వస్తువైనా ఉండొచ్చు. తెలుగు వారందరూ అర్హులే.
2. టైపింగ్లో ఒక పేజీకి (ఎ4) మించరాదు. పిడిఎఫ్
లో పంపాలి. హామీ పత్రం, చిరునామా జతపరచాలి.
3. రాతప్రతి పంపేవారు చక్కటి దస్తూరితో 2 పుటల్లో (ఎ4) రాసి పంపవచ్చు.
4. ఒకే అంశానికి ఒక కథ ఎంపిక.
5. ఒకరు ఒకటి కంటే ఎక్కువ పంపవచ్చు.
6. చిత్రాలు గీయగల్గితే గీసి పంపవచ్చు.
7. పెద్దలకు, పిల్లలకు వేరు వేరు సంకలనాలు.
8. అనువాదాలు, అనుసరణలు గతంలో అచ్చైనా కథలు
పంపకూడదు.
9. కథలో సమస్యతో పాటు నివారణ / జాగ్రత్తలు తెలిపే చక్కటి ఆలోచనలతో కలిగి ఉండాలి.
10. గడువు: 10th May, 2023 లోపల
11. పిడిఎఫ్ పంపడానికి వాట్సప్ నెంబర్: Mob: 9793059793, email id: desk.chelimi@gmail.com
12. పోస్టల్ చిరునామా: "భూపతి సదన్” 3-6-716, స్ట్రీట్ నెం. 12, హిమాయత్నగర్, హైదరాబాద్-500029, తెలంగాణ.
======================
గరిపల్లి
అశోక్
కన్వీనర్, బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు-2023
బాలచెలిమి, హైదరాబాద్, తెలంగాణ
======================
======================
0 Komentar