BARC Recruitment 2023: Apply for 4374
Various Posts – All the Details Here
బార్క్ లో 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ.21,700 - రూ.56,100
========================
ముంబయి ట్రాంబేలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన భాభా అణు పరిశోధనా కేంద్రం... డైరెక్ట్ రిక్రూట్మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 24 నుంచి మే 22 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
డైరెక్ట్
రిక్రూట్మెంట్:
1. టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు
2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు
3. టెక్నీషియన్/ బి: 24 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 212
ప్రారంభ
వేతనం: నెలకు టీవో ఖాళీలకు రూ.56,100; ఎస్ఏకు రూ.35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.
ట్రైనింగ్
స్కీం (స్టైపెండరీ ట్రైనీ):
1. కేటగిరీ-1: 1216 పోస్టులు
2. కేటగిరీ-2: 2946 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 4,162
స్టైపెండ్:
నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.
విభాగాలు: బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (22.5.2023 నాటికి): టెక్నికల్ ఆఫీసర్కు 18-35; సైంటిఫిక్ అసిస్టెంట్ కు
18-30;
టెక్నీషియను 18-25; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: టీవోకు రూ.500; ఎస్ఏకు రూ.150; టెక్నీషియన్కు రూ.100; కేటగిరీ-1కు రూ.150; కేటగిరీ-2కు రూ.100; ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన
తేదీలు
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 24-04-2023.
ఆన్లైన్
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-05-2023.
========================
========================
0 Komentar