BRAOU: B.Ed., Special Education (SE) Entrance
Test-2022-23 - All the Details
అంబేద్కర్
ఓపెన్ వర్సిటీ: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2022-23 లో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE
26-06-2023
ఫలితాలు విడుదల
======================
UPDATE
02-06-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 06/06/2023
======================
డా.బీ.ఆర్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) - బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రోగ్రామ్
వ్యవధి రెండున్నరేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అయిదు
సెమిస్టర్లు ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్ట్, కౌన్సెలింగ్
ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లీష్, తెలుగు
మాధ్యమాల్లో కోర్సు చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌నకు రిహెబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్
ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు ఉంది.
తెలుగు
రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పెషలైజేషన్‌లు
1. విజువల్ ఇంపెయిర్‌మెంట్
2. హియరింగ్ ఇంపెయిర్‌మెంట్
3. ఇంటలెక్చువల్ డిజెబిలిటీ
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
ద్వితీయ శ్రేణి మార్కులతో బీఏ/ బీకాం/ బీఎస్సి/ బీసీఏ/ బీఎస్సీ-హోం సైన్స్/
బీబీఎం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్సెస్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్
విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులే. సైన్స్, మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 55 శాతం మార్కులతో బిఈ/ బీటెక్ ఉత్తీర్ణులైనవారూ అప్లయ్
చేసుకోవచ్చు. దివ్యాంగుల తల్లిదండ్రులకు, దివ్యాంగులకు, ఆర్‌సీఐ
గుర్తింపు ఉన్న డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు లు చేసినవారికి ప్రథమ ప్రాధాన్యం
ఉంటుంది.
ఎంబీబీఎస్/
బీడీఎస్/ బీపీటీ/ బీఏఎంఎస్/ బీఎల్/ ఎల్‌ఎల్‌బీ/బీఫార్మసీ/ బీహెచ్‌ఎంటీ/
బీవీఎస్సీ/ బీఎస్సీ అగ్రికల్చర్/ బీఏ లాంగ్వేజెస్/ బీఓఎల్/ ఇతర ప్రొఫెషనల్
కోర్సులు చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
ఎంట్రెన్స్
టెస్ట్ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు
పార్ట్‌లు ఉంటాయి. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్
ప్రశ్నలు ఇస్తారు. మొదటి పార్ట్‌లో జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 40 ప్రశ్నలు; రెండో పార్ట్‌లో
జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ అండ్
అనలిటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ అబ్‌స్ట్రాక్ట్
రీజనింగ్ అంశాలనుంచి 60 ప్రశ్నలు
అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100.
ముఖ్య
సమాచారం
ప్రోగ్రామ్
ఫీజు: రూ.40,000
దరఖాస్తు
ఫీజు: రూ.1000, S.C./S.T/PWD లకు రూ.750
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-04-2023
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2023
హాల్
టికెట్స్ డౌన్‌లోడింగ్ తేదీ: 02-06-2023
ఎంట్రెన్స్
టెస్ట్ తేదీ: 06-06-2023
=========================
=========================
0 Komentar