ICICI Bank introduces EMI Facility for
UPI QR Code Payments – Details Here
ఐసీఐసీఐ బ్యాంక్: క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేసే UPI చెల్లింపుల మొత్తాన్ని నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే (EMI) అవకాశం – వివరాలు ఇవే
=========================
ఐసీఐసీఐ తమ
కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేసే UPI చెల్లింపుల మొత్తాన్ని నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే (EMI) అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే యూపీఐ
ద్వారా ఏ వస్తువునైనా కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చన్నమాట.
ఐసీఐసీఐ బ్యాంక్ అందించే 'పే లేటర్' వినియోగదారులకు ఈ సదుపాయం లభిస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటికి ఈ ఈఎంఐ సదుపాయం వర్తిస్తుంది.
ఆన్లైన్ పేమెంట్లకూ త్వరలో ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఐసీఐసీఐ బ్యాంక్
భావిస్తోంది. రూ.10 వేల కంటే ఎక్కువ
మొత్తాలను ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. యూపీఐ పద్ధతిలో ఎక్కువ మంది కొనుగోలు
చేస్తున్నారని, అందులోనూ ఐసీఐసీఐ అందించే ‘బై నౌ పే
లేటర్’ సర్వీసులను ఇటీవల కాలంలో ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని గమనించి ఈఎంఐ
సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ఛానల్ అండ్ పార్టనర్షిప్
హెడ్ బిజిత్ భాస్కర్ పేర్కొన్నారు.
ఈఎంఐ ఎలా..
వస్తువును
కొనే సమయంలో మీ వద్ద ఉన్న ఐసీఐసీఐ ఐమొబైల్ ఓపెన్ చేయాలి. అందులో 'స్కాన్ అండ్ పే' ఆప్షన్ని
ఎంచుకోవాలి. మీ లావాదేవీలు రూ.10 వేల కంటే ఎక్కువ ఉంటే
ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. మూడు, ఆరు, తొమ్మిది నెలలు కాలవ్యవధుల్లో చెల్లింపులకు అవకాశం ఉంటుంది.
ఇందులో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే లావాదేవీ పూర్తవుతుంది. పే లేటర్ సదుపాయాన్ని 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది.
=========================
=========================
#ICICIBank enables EMI facility for UPI payments made by scanning QR code for customers eligible for PayLater, the Bank’s ‘Buy Now, Pay Later’ service.
— ICICI Bank (@ICICIBank) April 11, 2023
The facility enhances the affordability of customers to buy products or services instantly.
Read more. https://t.co/26tFSO8fpi
0 Komentar