Ola Electric
MoveOS 4 update for New Bling Concert Mode – Details Here
ఓలా ఎలక్ట్రిక్ - 'మూవ్ ఓస్'కు త్వరలోనే అప్డేట్ - లైటింగ్ బ్లింక్ కన్సర్ట్ మోడ్ – వివరాలు ఇవే
=======================
ఓలా ఎలక్ట్రిక్ మరో అప్డేట్ తీసుకొస్తోంది. తమ ఈవీల్లోని 'మూవ్ ఓస్'కు త్వరలోనే నాలుగో అప్డేట్ (MoveOS 4)ను అందించనుంది. పలు కీలక మార్పులు జత చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి
కన్సర్ట్ మోడ్ (Concert Mode). మూడో అప్డేట్ ఇచ్చిన 'పార్టీ మోడు అడ్వాన్స్ దీన్ని తీసుకొస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవీష్
అగర్వాల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇది ఎలా ఉండబోతోందో తెలియజేసే వీడియోను
కూడా పోస్ట్ చేశారు.
కన్సర్ట్ మోడ్ వల్ల స్కూటర్లో ఉన్న లైట్లన్నీ మ్యూజిక్ కి
అనుగుణంగా బ్లింక్ అవ్వడం వీడియోలో గమనించవచ్చు. అలా అనేక స్కూటర్లను ఒక దగ్గరకు
చేర్చి కన్సర్ట్ మోడ్ ను ఆన్ చేసి మ్యూజిక్ ను ప్లే చేశారు. దీంతో మ్యూజిక్
కి అనుగుణంగా లైటింగ్ బ్లింక్ అవుతుండడంతో
ప్రత్యేక అనుభూతి కలుగుతున్నట్లు భవీష్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇలాంటి
ఫీచర్ కొత్తేమీ కాదు. టెస్లా కార్లలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ను అందిస్తున్నారు.
ఇటీవలే ఆస్కార్ గెలుచుకున్న తెలుగు పాట 'నాటు నాటు' బీటకు
అనుగుణంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులు టెస్లా కార్లతో ఇచ్చిన లైట్ల ప్రదర్శన
ఇలాంటి ఫీచర్ వల్లే సాధ్యమైంది.
=======================
Do you all want this feature in MoveOS 4?? 😀😉😎
— Bhavish Aggarwal (@bhash) April 4, 2023
After party mode, now Concert mode!! Coming soon.
P.S: This video is shot at the FutureFactory! pic.twitter.com/e2d1ntcxmP
0 Komentar