PM SHRI Scheme: Check the Selected 662 Schools
List from AP State
పీఎంశ్రీ పథకం: ఏపీ రాష్ట్రం నుండి ఎంపికైన 662 పాఠశాలల జాబితా ఇదే
======================
PM SHRI Scheme: PM Schools for Rising India
======================
పీఎంశ్రీ
పాఠశాలల) పథకం - ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అమలుకు రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆ స్కూళ్ల జాబితాకు కేంద్ర
విద్యాశాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. సమానత (ఈక్విటీ), అందుబాటు (యాక్సెస్), నాణ్యత
(క్వాలిటీ), ఇన్ క్లూజన్ తో సహా అన్నిస్థాయిల్లో
విద్యార్థులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు తోడ్పాటునందించనున్నాయి.
ఈ పథకం క్రింద
దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను
నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు
అవకాశమిచ్చింది. ఎంపికైన పాఠశాలలో 33 ప్రాథమిక
పాఠశాలలుండగా 629 సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి.
ల్యాబ్లు
వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలల్లో చేసే బోధనాభ్యసనాల ద్వారా
విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు
అమలులో ఉండే పీఎంశ్రీ స్కూళ్ల పథకాన్ని ప్రారంభించింది.
=========================
=========================
PM SHRI SCHOOLS – Proceedings and
Guidelines
=========================
0 Komentar