Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Punjab Govt Changes Office Timings to Save Power in Summer - Check the New Working Hours

 

Punjab Govt Changes Office Timings to Save Power in Summer - Check the New Working Hours

పంజాబ్: వేసవిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రభుత్వం కార్యాలయల పని వేళల్లో మార్పు – వివరాలు ఇవే

=======================

వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు  పిల్లలకు బడులను ఒంటిపూటే నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించింది పంజాబ్ ప్రభుత్వం. వచ్చే నెల నుంచి ఒంటిపూట ఆఫీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం ఈ కీలక ప్రకటన చేశారు.

పంజాబ్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే మే 2వ తేదీ నుంచి ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 15 వరకు ఈ కొత్త పనివేళలు అమల్లో ఉంటాయని సీఎం భగవంత్ మాన్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్ లోడ్ కూడా తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. "మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్ పై లోడ్ అధికంగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్ 300-350 మెగావాట్లు తగ్గుతుంది. నేను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తాను" అని భగవంత్ మాన్ ఈ సందర్భంగా తెలిపారు.

గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఈ ఏడాది వేసవి లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఏప్రిల్- జూన్ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags