Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

These Bengaluru Kids Got Bored During Summer Holidays and They did a Special Viral Thing

 

These Bengaluru Kids Got Bored During Summer Holidays and They did a Special Viral Thing

ఈ బెంగళూరు చిన్నారులు వేసవి సెలవులు బోర్ కొట్టి ఏమి చేశారో తెలుసా?  

==========================

వేసవి సెలవులలో పిల్లలకి  ఆడుకోవటం, ఫోన్లు చూడటం సరదా. కానీ అది కొన్ని రోజులే. ఎక్కువ రోజులు సెలవులుంటే ఏం చేయాలో పాలుపోక.. బోర్ ఫీలవుతుంటారు. ఈ చిన్నారులకు సెలవులు బోర్ కొట్టాయంట. ఈ సందర్భాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. వీధిలో నిమ్మరసం విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే బెంగళూరు నగరంలో కన్పించిందీ దృశ్యం.

చిన్నారులు ఓ ఇంటి గేటు ముందు నిమ్మరసం విక్రయిన్న ఫొటోను ‘ఆయుషి కుచో’ అనే మహిళా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందిరాగనగర్ లోని ఓ ఇంటి ముందు స్టాల్ ఏర్పాటు చేసిన ఆ పిల్లలు.. తమ స్టడీ టేబుల్ పై నిమ్మరసం పెట్టి విక్రయిస్తున్నారు. తాము తయారుచేసిన నిమ్మరసాన్ని అమ్ముతున్నారు. 'వైట్ షుగర్ లెమనేడ్', 'బ్రౌన్ షుగర్ లెమనేడ్', 'ప్లేన్ లెమనేడ్', 'సాల్టెడ్ లెమనేడ్ ఇలా పలు రకాల నిమ్మరసాలను వీరు విక్రయిస్తున్నారు. ఒక్కో గ్లాసు ధర రూ.10గా ఉండగా.. వీటిపై డిస్కౌంట్లు కూడా ప్రకటించేశారు.

ఈ ఫొటోలను ఆయుషి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. చిన్నారుల ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. “ఇందిరానగర్ ఇరుకు వీధుల్లో వెళ్తుండగా నాకు కన్పించిందీ దృశ్యం. బోర్ గా ఉందని ఆ పిల్లలు ఈ విక్రయం ప్రారంభించారట. విక్రయ కళను నేర్చుకునేందుకు సరైన మార్గం, సరైన వయసు” అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. 'ఎదుగుతున్న ఎంటర్ప్రైన్యూర్స్' అంటూ నెటిజన్లు వీరిని కొనియాడుతున్నారు.

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags