TS: Covid- Booster Doses
(CorBEvax) in Telangana from April 19
ఏప్రిల్ 19 నుండి తెలంగాణలో కోవిడ్-బూస్టర్ డోసెస్ (కార్బోవ్యాక్సిన్)
========================
కొవిడ్
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బూస్టర్ డోసు అందించాలని తెలంగాణ సర్కారు
నిర్ణయించింది.
బుధవారం (April 19) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్బో వ్యాక్సిన్ ను బూస్టర్
డోస్ అందించనున్నట్టు ప్రజారోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు తెలిపారు. 5 లక్షల కార్బోవ్యాక్సిన్ డోస్లు అందుబాటులో ఉన్నాయని
వెల్లడించారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండో డోసు కొవాగ్జిన్, కొవిషీల్డ్
ఏది తీసుకున్నా.. బూస్టర్ డోస్ కార్బో వ్యాక్సిన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొర్బీ వ్యాక్సిన్
అందుబాటులో ఉంటుందన్నారు.
గత కొంత
కాలంగా కొవిడ్ వ్యాక్సిన్ల కొరత కారణంగా బూస్టర్ డోసుల పంపిణీ నిలిచిపోయింది.
కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలే స్వయంగా కొవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని
ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి చెందిన వ్యాక్సిన్
తయారీ సంస్థ బయోలాజికల్ ఈ నుంచి 5 లక్షల కార్బో
వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
========================
0 Komentar