TS: Regularization of
the Services of 5544 Contract Personnel – G.O Released
తెలంగాణ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ - 5544 కాంట్రాక్టు
ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల
=======================
కొత్త సచివాలయం
ప్రారంభోత్సవ సందర్భం లో కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై సీఎం
కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు
తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన
ఉత్తర్వులను మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్
లెక్చరర్లు (ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక
విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్
టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారుల ఉద్యోగాలను
క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
=======================
Pubic Services –
Act 2 of 1994 – Regularization of the services of Contract personnel – Orders –
Issued.
G.O.Ms.No. 38,
Dated: 30.04.2023
=======================
0 Komentar